Rashmi Viral Tweet :
టాలీవుడ్ బుల్లితెర మీద యాంకరింగ్ తో సత్తా చాటుకున్న హాట్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. ఈమె యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది.. అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ప్రజెంట్ కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది..
ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. అలాగే బుల్లితెర మీద రెండు చేతుల సంపాదిస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను గుర్తుకు తెస్తుంది.
తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్రమంలోనే ఈమె పెట్టిన పోస్ట్ మీద ఒక నెటిజెన్ స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడికి తన స్టైల్ లో వార్ణింగ్ ఇచ్చింది రష్మీ..
ఈ వాగ్వాదంలో ఈమె విసిగిపోయి ఒకానొక సందర్భంలో నీకు భాజపాతో సమస్య ఉంటే నాతో ఎందుకు గొడవ చేస్తున్నావ్ అంటూ అతడిని నిలదీసింది.. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడిన ఒక వీడియోకు రష్మీ ఒక ఇమేజీని జోడించగా ఒక నెటిజెన్ దీనిపై వాగ్వివాదం చేసాడు. ఈ వ్యవహారంలోనే రష్మీకి అతడిని ట్విట్టర్ లో మాటల యుద్ధం జరిగింది.. ఆ ట్వీట్స్ అన్ని వైరల్ అయ్యాయి.
Again don’t mix people with beliefs
You think other religions don’t have polygamy set up a or 7 wives culture
Do you have the guts to point them out
Don’t mix up beliefs with man made decisions
You have a problem with an individuals life choice take it up with him/her
But do… https://t.co/lJaqbIegq7— rashmi gautam (@rashmigautam27) September 12, 2023