27.9 C
India
Thursday, September 10, 2026
More

    Pawan Kalyan VS JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకేనా..?

    Date:

    Pawan Kalyan VS JR NTR
    Pawan Kalyan VS JR NTR

    Pawan Kalyan VS JR NTR : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో ‘వారాహి యాత్ర’ చేస్తున్నాడు. ఆయన యాత్రలో వందలాది నుంచి వేలాది మంది వరకు పాల్గొంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో సాయంత్రం వేళ భారీ రోడ్ షో నిర్వహిస్తున్న ఆయన పలు ఆసక్తి కర విషయాలను పంచుకుంటున్నారు. సనిమాలకు రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదంటూ పవన్ కళ్యాణ్ చేసేన వ్యాఖ్యలు పార్టీతో పాటూ అభిమానులు, కార్యకర్తలో కాసేపు టెన్షన్ క్రియేట్ చేశాయి.

    ‘వారాహి యాత్ర’ శుక్రవారం పిఠాపురంలో కొనసాగింది. ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్‌ షోలో భాగంగా పిఠాపురంలో పవన్‌ మాట్లాడారు.. ‘నేను ఫ్యాన్‌ క్లబ్‌ పెట్టలేదు. తోటి ఆర్టిస్ట్ లు, నటులపై నాకు గౌరవం, ఇష్టం ఉంటుంది. వాళ్ల సినిమాలను కూడా నేను బాగా చూస్తాను. సినిమా వేరు రాజకీయం వేరు. మీరందరూ రకరకలా హీరోలను అభిమానించండి.. ఇష్టపడండి. కానీ, రాష్ట్ర ప్రయోజనాల దగ్గరకు వచ్చే సరికి. కేవలం వాటి గురించి మాత్రమే ఆలోచించండి. నాకు రామ్‌ చరణ్‌ ఇష్టం.. అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే కూడా ఇష్టం.. ఇక ప్రభాస్‌ అంటే.. చిరంజీవి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ ఇష్టపడతాను. అందరి సినిమాలు చూస్తాను. ఇది నాకు ఆనందం. నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నిలబడుతుందా.. దేశంలోని నటుల్లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే వారిలో నేనూ ఒకడ్ని. నేనొకడిని మాత్రమే అని చెప్పడం లేదు. నేను ఓ సినిమా చేస్తే దాని వలన 500 మందికి ఉపాధి లభిస్తుంది’ అన్నారు పవన్ కళ్యాణ్.

    పవన్‌ కళ్యాణ్ కు జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే ఇష్టం అన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అటు పవన్‌ ఫ్యాన్స్‌.. ఇటు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌.. వీడియోను షేర్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తున్నారు. మరో ఆరు నెలలు ‘వారాహి యాత్ర’ కొనసాగనుంది. మొదట ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తర్వాత మిగిలిన జిల్లాల్లో పర్యటిస్తారు. అందుకు షెడ్యూల్ పెట్టుకుంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    NTR : ఎన్టీఆర్ ఫేస్ లో కల పోయిందా..? ఎందుకిలా చేశాడు..?

    Jr. NTR : ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ చూసినవాళ్లు ఒక్క సారి...

    NTR : ఎన్టీఆర్‌ను రజనీకాంత్‌తో పోలుస్తున్నారా?

    NTR : రజనీకాంత్‌కు ఒక ప్రత్యేకమైన శైలి ఉండటం వల్లనే ఆయన చాలా...

    NTR wife : ఎన్టీఆర్ భార్య పుట్టినరోజు వేడుకలు జపాన్‌లో… ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    NTR wife : ప్రస్తుతం తన తాజా చిత్రం 'దేవర' విడుదల కోసం...