Pawan Kalyan Renu Desai : పవన్ కల్యాణ్ అంటే వ్యక్తి శక్తి అని అందరు చెబుతుంటారు. నిజంగానే ఆయన బయట కూడా అలాగే ఉంటారు. ఆయన నైతికత మీద మాజీ భార్య రేణు దేశాయ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్పందించారు. ఓ వీడియో విడుదల చేసింది. పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదు. ఆయన డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వరు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే తపిస్తుంటారు. అలాంటి వ్యక్తికి ఓ సారి అవకాశమిస్తే పాలన ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.
రాజకీయంగా తన మద్దతు ఆయనకే. ఆయన సమాజం కోసం పనిచేయాలనుకుంటారు. మనీ మైండెడ్ కాదు పేదల కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఓ సారి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. పిల్లలను కూడా ఆయన బాగానే చూసుకుంటున్నారు.
ఇటీవల బ్రో సినిమా వివాదంలో కూడా రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది సరైంది కాదు. ఎవరో అన్నారు పవన్ కల్యాణ్ మీద సినిమా తీస్తానని చెప్పారు. ఇది కరెక్టు కాదు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం పవన్ కల్యాణ్ పై రాజకీయ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. రాజకీయ కోణాల్లో కాకుండా ఆయననో మంచి నేతగా చూడండి అని సూచిస్తున్నారు.
పవన్ స్వభావం కూడా చాలా మంచిది. ఆయన ఒకరికి నష్టం కలగాలని ఎన్నడు ఆశించడు. ఎవరి లక్ వారిదని నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయంగా తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదని చెబుతోంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తనకు ఇస్తే ఎలాంటి పాలన అందిస్తారో చూడాలి అని తన మనసులోని అభిప్రాయం బయటపెట్టింది. ఇలాంటి పవన్ కల్యాణ్ గురించి పడని వ్యక్తులు కుట్రలు చేయడం బాగా లేదని చెబుతోంది.
ఇలా పవన్ కల్యాణ్ గురించి రేణు దేశాయ్ పాజిటివ్ గా మాట్లాడింది. వచ్చే ఎన్నికల్లో తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని కుండ బద్ధలు కొట్టింది. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన పాలన ఓసారి చూడాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలిచి తీరాలని అభిప్రాయపడింది.
View this post on Instagram