
Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చి.. ల.. సౌ.., హిట్, సైంధవ్ తో పాటు మరిన్ని మూవీస్ లో గుర్తింపు సంపాదించుకుంది. దీంతో టాలీవుడ్ లో మంచి అవకాశాలను ఎగరేసుకుపోతోంది.
ఇటీవల టూర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది ఈ చిన్నది. తన బీచ్ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలకు అందమైన స్వేచ్ఛగా సంచరించే బటర్ ఫ్లై (సితాకోక చిలుక) ఏమోజీని ట్యాగ్ చేసి మీరి సోషల్ మీడియాలో వదిలింది. దీంతో కుర్రకారు ఆమె పిక్స్ ను షేర్ చేస్తున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ లో ఆమె ప్రయాణం 2013లో వచ్చిన ‘తేకా బై అమ్మీ బాస్’, ‘క్లాస్‌రూమ్’, మరియు ‘కుడి తు పటాకా’ వంటి పంజాబీ మ్యూజిక్ వీడియోలతో ప్రారంభమైంది. 2018లో చి.. ల.. సౌ..లో తెలుగులోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది.
2020లో ఆమె ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘డర్టీ హరి’ వంటి తెలుగు హిట్లలో కనిపించింది. ఆ తర్వాత 2021లో ‘నూటొక్క జిల్లాల అందగాడు’. రుహాని శర్మ తెలుగు ఆంథాలజీ చిత్రం ‘మీట్ క్యూట్’లో 2023లో వచ్చిన ఆగ్రా చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రుహానీ ‘శ్రీ రంగ నీతులు’లో నటిస్తోంది.