33.2 C
India
Saturday, May 4, 2024
More

    Suma Words Viral : హఠాత్తుగా చనిపోతే? సుమ మాటలు వైరల్.. పిల్లలకు ఏం చెప్పిందంటే?

    Date:

    Suma Words Viral
    Suma Words Viral

    Suma Words Viral : యాంకర్ల గురించి మాట్లాడాలనుకుంటే సుమ నుంచే మొదలుపెట్టాలి. తెలుగు యువతి కాకపోయినా కష్టపడి తెలుగు నేర్చుకొని మరీ ఇండస్ట్రీని ఏలుతుంది. ఎంతో మంది యాంకర్లు ఆమెతో కలిసి వచ్చారు.. వెనుకబడ్డారు.. కానీ ఆమె మాత్రం ఇప్పటికీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇటు బుల్లితెర, అటు వెండితెర రెండు తెరలపై తన ఆదిపత్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఈవెంట్లు, షోలలో సుమ ఉన్నదంటే ఇక సందడి ఉన్నట్లే.. స్టార్ హీరోలను, హీరోయిన్లను షోలో ఇన్వాల్వ్ చేస్తూ మరింత ఉత్సాహాన్ని తెస్తుంది.

    మలయాళీ కుట్టి అయినా చక్కటి తెలుగు మాట్లాడుతుంది సుమ. నిజానికి తెలుగు వారు కూడా ఇంత చక్కటి తెలుగు మాట్లాడుతారా? అంటే కాదనిపిస్తుంది. మొదట్లో సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమ యాంకరింగ్ లో బిజీగా ఉంటే.. రాజీవ్ కనకాల మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్నాడు. ఇక సుమ-రాజీవ్ కనకాల కొడుకు రోషన్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు. ఆయన నటించిన ‘బబుల్ గమ్’ టీజర్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. తన కొడుకు ఎంట్రీ నేపథ్యంలో సుమ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

    ‘ప్రస్తుత సమాజంలో భర్తలు చనిపోతే భార్యలు కుటుంబ పోషణ కోసం పని చేయాల్సి వస్తుంది. కనీసం వారికి బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం, ఇన్స్యూరెన్స్ లాంటివి తెలియదు. తన భర్త చనిపోతే ఇన్స్యూరెన్స్ ఎంత వస్తుందని కూడా తెలియదు. ఇలాంటి విషయాలు మహిళలకు తెలిసేలా చేయడం మనం బాధ్యతగా తీసుకోవాలి. అందుకే నేను కూడా ఇన్య్సూరెన్స్ గురించి నా పిల్లలను కూర్చోబెట్టి చెప్పాను.

    అనుకోని ప్రమాదం సంభవించి నేను చనిపోతే ఎవరికి ఎంత డబ్బు వస్తుందో వివరంగా చెప్పాను. నేను చెప్పేప్పుడు ఎందుకు మమ్మీ నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటూ అడిగేవారు. వీటి గురించి మీకు తెలియాలని చెప్పాను. ఈ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇలాంటి విషయాలు పిల్లలకు చెప్తే వారు ఆర్థికంగా ఇబ్బందుల నుంచి దూరం అవుతారు.’ అని చెప్పింది. ఇప్పుడు సుమ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కొందరు సుమకు మద్దతు తెలుపుతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM REVANTH REDDY: క్యాబ్,ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా: సీయం రేవంత్ రెడ్డి

      తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు,గిగ్ కార్మికులకు శుభవార్త చెప్పారు....

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...