Taapsee Pannu : తాప్సీ పన్ను పాన్ ఇండియన్ వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న ఒకప్పుడు మాత్రం ఈమె సౌత్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా అవకాశాలు అందుకుంటుంది..
ఈమె సినిమాలు అక్కడ పెద్ద హిట్ అవ్వకపోయిన అవకాశాలు మాత్రం వరిస్తూనే ఉన్నాయి.. ప్రజెంట్ వరుస ప్లాపులతో ఈమె కెరీర్ సాగుతున్నప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ భామ సినిమాల విషయం పక్కన పెడితే ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా వివాదలు ఎదుర్కొంది. ఈ వివాదాలతోనే ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది.
ఎప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.. అలా ఈ భామ సినిమాల కంటే వ్యక్తిగత కామెంట్స్ తోనే ఫేమస్ అయ్యింది.. ఇక ఈ భామ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెకు కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ.. సౌత్ కంటే బాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువుగా ఉంది..
నేను బాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలో అర్ధరాత్రి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కు రమ్మని వేధించేవారు.. రానని చూపిన వినేవారు కాదు.. ముఖ్యంగా ఒక ఇద్దరు హీరోలు మాత్రం తమతో డేటింగ్ చేయాలని చాలా కాలం వేధించారు.. అయినా నేను ఒప్పుకోక పోవడంతో ఛాన్సులు నీకు ఎలా వస్తాయో చూస్తామని బెదిరించారు.. అయితే ఇలాంటివన్నీ నేను సీరియస్ గా తీసుకోకుండా నన్ను నమ్ముకుని మాత్రమే ఇక్కడి వరకు వచ్చానంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..