24 C
India
Monday, July 8, 2024
More

    Team India : ప్రధానితో టీమిండియా.. వారితో ఏం మాట్లాడారంటే

    Date:

    Team India with the Prime Minister : టీ20 వరల్డ్ కప్ 2024 సాధించిన తర్వాత బార్బడోస్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన జట్టుకు దేశం యావత్తు స్వాగతం తెలిపింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చివరి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కప్పు దక్కించుకోవడంతో భారత్ ఆనందంలో మునిగిపోయింది. కప్పుతో వచ్చిన హీరోలను చూసి శుభాకాంక్షలు చెప్పింది. వరల్డ్ కప్ కు వెళ్తున్న జట్టుపై భారత్ పెట్టుకున్న ఆశలను నెరవేర్చింది.

    అయితే బార్బడోస్ లో తుఫాన్ కారణంగా ఇంటర్నేషనల్ విమానాశ్రయం మూసి వేయడంతో జట్టు అక్కడే ఇరుక్కుపోయింది. పరిస్థితులు కొంచెం చక్కబడిన తర్వాత ఎయిరిండియా భారత ఆటగాళ్ల కోసం స్పెషల్ ప్లెయిన్ ను పంపించింది. ఈ ప్లెయిన్ కు ‘ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్’ అని పేరును కూడా పెట్టింది. ఇది బ్రడ్జిటౌన్ నుంచి బయల్దేరి న్యూయార్క్ మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది.

    భారత కాలమనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు టీమిండియా ఢిల్లీలో అడుగుపెట్టింది. జట్టును చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి రాహుల్ సేన నేరుగా పీఎం నివాసానికి వెళ్లింది. అక్కడ వారికి అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీతో అల్పాహార వింధు చేశారు. ఈ సందర్భంగా భారత జట్టు ‘ఛాంపియన్’ అన్న జర్సీని ధరించారు.

    భారీ ర్యాలీ.. ఘనంగా సన్మానం.. టీమిండియా క్రికెటర్ల మనోగతం ఇది

    భారత క్రికెట్ టీం పొట్టి కప్ (టీ20)తో బార్బడోస్ నుంచి నిన్న (జూలై 4) ఉదయం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో ఆడిన చివరి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కప్పు దక్కించుకోవడంతో భారత్ యవత్తు మురిసిపోతోంది. కప్పుతో వచ్చిన హీరోలను చూసి శుభాకాంక్షలు చెప్తోంది. వరల్డ్ కప్ కు వెళ్తున్న జట్టుపై భారత్ యావత్తు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో భారత్ విజయం సాధిస్తుందా? అన్న అనుమానంతో ఉన్న భారతావనికి ఫైనల్ మ్యాచ్ ఆనందాన్ని మిగిల్చింది.

    కప్పుతో వచ్చిన టీమిండియాకు భారీ స్వాగతం లభించింది. రాహుల్ సేనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో విమానాశ్రయం పరిసరాలు జన సంద్రంతో కిక్కిరిసాయి. ఆ తర్వాత మోడీతో మీటింగ్, అది ముగియగానే జట్టు ముంబై బయల్దేరి వెళ్లింది. రాత్రి 7.30 తర్వాత నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన విజయోత్సవ యాత్రలో జనాలు కిక్కిరిసి కనిపించారు. మెరైన్ డ్రైవ్ రోడ్డు మరో అరేబియా సముద్రంలా జనంతో కిక్కిరిసి కనిపించింది. ఈ రోడ్డు గుండా వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ సాగింది.

    గంటన్నర పాటు విజయోత్సవ యాత్ర తర్వాత టీమ్ వాంఖడే స్టేడియం చేరుకుంది. అప్పటికే స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లతో నిండిపోయింది. ఉదయం 4 గంటల నుంచే స్టేడియం గేట్లు తెరిచారు. ఉచితంగానే అభిమానులను అనుమతించారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులతో స్టేడియం యావత్తు హోరెత్తింది. ఇక్కడే క్రికెటర్లను బీసీసీఐ సన్మానించింది. కప్ అనంతరం జట్టుకు ఇస్తానన్న రూ. 125 కోట్ల ప్రైజ్ మనీని బోర్డు అందజేసింది.

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai : టీడీపీ చారిత్రక విజయం తర్వాత తెలుగునేలపై డా.జై గారు.. విజేతలకు అభినందన

    Dr. Jai Garu : అభివృద్ధి ప్రదాత,  పాలన దక్షుడు, సమర్థ...

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Modi Vs Rahul Gandhi : మోడీ – రాహుల్ మధ్యన ‘మత’ రాజకీయం..

    Modi Vs Rahul Gandhi : నేడు దేశంలో రాజకీయాలు గమ్మత్తుగా...

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...