35 C
India
Saturday, May 4, 2024
More

    Telangana CM KCR : సీఎం కేసీఆర్ అందుకే ప్రజలను కలవరు..? ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..

    Date:

    Telangana CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను నేరుగా కలవరని అందుకు కారణం కూడా ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఒక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

    ‘ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదు.. ముఖ్యమంత్రి ప్రజలకు వద్దకురావడం లేదని.. ముఖ్యమంత్రి వద్దకు ప్రజలను ఎందుకు అనుమతించరు ఎవరో ఒకరు ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. వాటిని సీరియస్ గా తీసుకోవద్దు. ముఖ్యమంత్రి కింద అధికార యంత్రాంగం పని చేస్తూ  ఉంటుంది. గ్రామ స్థాయి వరకు చూసుకుంటే 6.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేల నుంచి వార్డు మెంబర్ల వరకు పాలనా యంత్రంగం ఉంది. ఒక వైపు లెటస్లేచివ్ సైడ్ ప్రజా ప్రతినిధులు ఉంటే.. ఎగ్జిక్యూటివ్ సైడ్ అధికారులు ఉన్నారు.

    ఇక ముఖ్యమంత్రిని కాలిసే వారు పింఛన్ కావాలని, డ్రేనేజీ సమస్య ఉందని, రోడ్లు బాగోలేవని ఇలాంటి సమస్యలతో రావద్దు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సంబంధించి సూపర్ పవర్. ఇటు అధికార యంత్రాంగం, అటు పాలకులు పరిష్కరించలేని జఠిలమైన సమస్య ఏర్పడితే తప్ప ముఖ్యమంత్రి వరకు వెళ్లద్దు. అసలు సీఎం చేసే పనులు వేరు. ప్రజా సంక్షేమం కోసం శాసన సభలో బిల్లులు పెట్టడం, వాటి రూపకల్పన, బిల్లులపై అధికార యంత్రాంగం పనితీరు. శాసన సభ్యులతో పని చేయించే విధానం ఇంకా ఇలాంటి చాలానే ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలను ముఖ్యమంత్రి పట్టించుకుంటే పాలన గాడి తప్పుతుంది. ఇక తన ఉద్యోగులు ఏ మేరకు పని చేస్తున్నారన్న విషయం కూడా తెలియదు’ అంటూ చెప్పేవారన్నారు కేటీఆర్.

    ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీటిని ప్రతిపక్షాలు మరోలా అర్థం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి కేటీఆర్ ఇంత చెప్తున్నా పాలన ఎందుకు గాడి తప్పుతుందో కూడా చెప్తే బాగుండని కాంగ్రెస్, బీజేపీ ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...