29.2 C
India
Saturday, May 4, 2024
More

    Dil Raju : ఆ సినిమా విషయంలో దిల్ రాజుకు బెదిరింపులు

    Date:

    Dil Raju
    star producer Dil Raju

    Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ థియేటర్స్ దిల్ రాజు హ్యాండోవర్ లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ లో ఆయన ప్రభావం ప్రముఖంగా ఉంటుంది. సంక్రాంతికి సంబంధించి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికి థియేటర్లను కేటాయించడంలో దిల్ రాజు పాత్ర అత్యంత కీలకం కానుంది.

    మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ను దిల్ రాజు తన బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకే కేటాయించారు. అదే రోజు తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న ‘హను-మాన్’ కూడా రిలీజ్ కాబోతోంది. అయితే దీనికి తక్కువ థియేటర్లు కేటాయించారు. మొదట్లో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవాలని ప్రొడ్యూసర్ కౌన్సిల్ మేకర్స్ కు తెలిపింది. నార్త్ లో సినిమా రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పోస్ట్ పోన్ అస్సలు కుదరదని మేకర్స్ కౌన్సిల్ ఎదుట మొర పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ ‘ఈగల్’ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పక్కన ఉంచితే..

    హను-మాన్ కు తక్కువ థియేటర్లను కేటాయించడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలుగజేసుకున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. హను-మాన్ లాంటి దేవుడి సినిమాకు తక్కువ థియేటర్స్ కేటాయించడంపై దిల్ రాజుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ‘హను-మన్ కు ఎక్కువ థియేటర్స్ కేటాయించాలి, లేదంటే లీగల్ నోటీసులు పంపుతాం అంటూ అల్టిమేటం జారీ చేశారట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నిజమా? లేదంటే రూమరా తెలియాలంటే దిల్ రాజు స్పందించాల్సిందే..

    సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో వస్తున్న హను-మాన్ ను ప్రశాంత్ వర్మ తేజసజ్జతో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. అదే రోజు మహేశ్ గుంటూరు కారం కూడా రిలీజ్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...

    Producer Dil Raju : ఇందూరు బరిలో దిల్ రాజు..రేవంత్ నిర్ణయమే ఫైనల్

    Producer Dil Raju : మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు ముగించుకుని.. మరో...