Trivikram :
తెలుగు పరిశ్రమలో మంచి పట్టున్న రచయితగా త్రివిక్రమ్ కు పేరుంది. ఆయన సినిమాలో పంచ్ డైలాగులు ఉంటాయని భావిస్తుంటారు. ప్రాసలకు ప్రాణం ఇస్తాడని అంటుంటారు. దీంతో చాలా సినిమాల్లో తనదైన శైలో పంచు డైలాగులు రాయడం ఆయనకు అలవాటే. కానీ ఇటీవల కాలంలో ఆయనలో పంచులు తగ్గినట్లు చెబుతున్నారు. ఏమాత్రం పసలేని మాటలు రాస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ఇటీవల వచ్చిన బ్రో సినిమాకు సంభాషణలు రాసింది ఆయనే. కానీ పేలే డైలాగులు మాత్రం లేవని నిట్టూరుస్తున్నారు అభిమానులు. తనదైన శైలిలో పంచులతో చంపే త్రివిక్రమ్ కలం మొద్దుబారిందా? అనే సందేహాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ బ్రో సినిమా కోసం తీసుకున్న పారితోషికం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. రూ. 15 కోట్లు ఈ సినిమా కోసం తీసుకున్నారంటే అతిశయోక్తి కాదు.
డైలాగులు చూస్తే మాత్రం అంత రేంజిలో లేవని అంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే డైలాగులకే ఫిదా అవుతారు ప్రేక్షకులు. కానీ త్రివిక్రమ్ ఈ సినిమాలో ఒక్క పంచ్ డైలాగ్ కూడా పేలకపోవడం గమనార్హం. దీంతో త్రివిక్రమ్ పని అయిపోయిందా అని అనుకుంటున్నారు. ఇదివరకు చేసిన సినిమాల్లో అదరగొట్టే సంభాషణలు రాసిన ఆయన బ్రో సినిమాకు మాత్రం నిరాశపరచారు.
ఈ సినిమాకు ముందు బుర్ర సాయిమాధవ్ ను అనుకున్నారట. కానీ తరువాత ఏమైందో కానీ త్రివిక్రమ్ ను తీసుకున్నారు. ఇంతకంటే మంచిగా రాయగలిగే సత్తా ఉన్నవారున్నా త్రివిక్రమ్ నే ఎంచుకోవడం వెనుక పవన్ కల్యాణ్ చొరవ ఉందని తెలుస్తోంది. కానీ ఆ స్కోప్ లో డైలాగులు లేకపోవడం అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది. సో సాయిమాధవ్ ను పెట్టుకుంటే మాటలు మరోలా ఉండేవని అంటున్నారు.