33.7 C
India
Sunday, May 5, 2024
More

    Turkish Princess : రాజభోగాలు అనుభవించి.. బహిష్కరణకు గురైన రాజ కుటంబం టర్కీ ప్రిన్సెస్ కథేంటి.. ఇండియాకు సంబంధంమేంటి?

    Date:

    Turkish Princess
    Turkish Princess

    Turkish Princess : హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కోడలు దురేషే వార్ . హైదరాబాద్‌లో ఆమె చేసిన సామాజిక సేవలు  దాతృత్వానికి మారుపేరుగా నిలిచాయి. షెహ్వార్ టర్కీలో పుట్టి ఫ్రాన్స్‌లో పెరిగింది. 1931లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన హైదరాబాద్ నిజాం కొడుకుతో వివాహమైంది. దురేషే వార్ తన జీవిత చరమాంకాన్ని లండన్‌లో గడిపాడు. ఆమె ఆధునికతకు పెద్ద పీట వేసింది. నిజాం ఇంటి తలుపులు తెరిచి, హైదరాబాద్‌లో మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు.

    టర్కీ యువరాణి దురేషే వార్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆజం జా బహదూర్‌ను వివాహమాడారు. ఈ వివాహం ప్రపంచంలోని రెండు అతిపెద్ద ముస్లిం కుటుంబాలైన టర్కిష్ ఖలికాలు,  హైదరాబాద్‌లోని అసఫ్ జాహీల మధ్య బంధుత్వానికి వారధిగా నిలిచింది. దురుషేవార్ తుర్కియేకు చెందిన ఖలీఫ్ అబ్దుల్ మజీద్-2కు ఏకైక కుమార్తె. ఆమె 1914లో పుట్టింది. ఆధునిక విద్య తో  మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. ఆమె తన తండ్రి వారసురాలు కావాలని ఆశించింది.

    సింహాసనం నుంచి  నేలపైకి  
    టర్కీ మార్చి 1924లో గణతంత్ర రాజ్యంగా మారింది, ఆ తర్వాత కాలిఫేట్ సామ్రాజ్యం ముగిసింది.  రాజకుటుంబం దేశం నుంచి బహిష్కరణకు గురైంది. అబ్దుల్ మజీద్, అతని కుటుంబం దక్షిణ ఫ్రెంచ్ మెడిటరేనియన్ పోర్ట్ సిటీ నైస్‌లో స్థిరపడ్డారు. బహిష్కరణకు గురైన  మాజీ పాలకుడి పట్ల  బ్రిటీష్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సానుభూతి చూపింది.  ‘పేద కాలిఫేట్’కు సాయం చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం పాలకులకు విజ్ఞప్తి చేసింది.

    జీవితకాలం పింఛన్ ఇచ్చిన నిజాం..
    నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవీచ్యుతుడైన ఖలీఫాకు జీవితకాలపు పెన్షన్ 300 పౌండ్లు, అతని కుటుంబంలోని అనేక ఇతర సభ్యులకు భత్యాలు పంపాలని నిర్ణయించుకున్నాడు. దురేషే వార్  యుక్త వయసుకు రాగానే అనేక ముస్లిం రాజ కుటుంబాలు,  పర్షియా షా, ఈజిప్ట్ రాజుతో సహా వారి వారసుల కోసం  వివాహ ప్రతిపాదనలు పంపారు.

    షౌకత్ అలీ ఖలీఫా కుమార్తె వివాహం కోసం తన పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆజం జా ప్రతిపాదనను పంపమని నిజాంను కోరాడు. షెహ్వార్ తండ్రి ఈ సంబంధాన్ని తిరస్కరించలేకపోయాడు. ఇందుకు కారణం కష్టకాలంలో నిజాం అతడిని ఆదుకోవడమే.  షౌకత్ అలీ ప్రోద్బలంతో, ఖలీఫా తన సోదరుడి కుమార్తె నీలోఫర్‌ను నిజాం చిన్న కుమారుడు యువరాజు మౌజం జాతో వివాహాన్ని ప్రతిపాదించాడు. నిజాం వెంటనే అంగీకరించి తన కుమారులిద్దరినీ ఫ్రాన్స్‌కు పంపాడు . 12 నవంబర్ 1931న, జా యువరాణి షెహ్వార్,  ప్రిన్స్ మౌజమ్,  నీలోఫర్‌లతో  నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. దీనికి సుల్తాన్ కుటుంబ సభ్యులు, కొంతమంది టర్కీ ప్రభువులు,  స్నేహితులు నిజాం ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. నైస్‌లో నెల రోజుల వేడుక తర్వాత యువరాజు తన భార్యలతో కలిసి 12 డిసెంబర్ 1931న వెనిస్‌ను విడిచిపెట్టి భారతదేశానికి బయలుదేరాడు.   హైదరాబాద్ వచ్చిన తర్వాత షెహ్వార్ చురుగ్గా  వ్యవహరించారు.  ప్రజల్లో ముఖ్యంగా మహిళల కోసం పనిచేయడం ప్రారంభించారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related