Baby Movie In Bollywood : డైరెక్టర్ సాయి రాజేశ్, హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన మూవీ ‘బేబీ’. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యంగ్ జనగరేషన్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సంవత్సరం టాలీవుడ్ లో టాప్ బ్లాక్ బస్టర్లలో ప్లేస్ దక్కించుకుంది ఈ సినిమా. అయితే ఈ మూవీని బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తామన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్. దీని దర్శకుడు సాయి రాజేశే బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో బేబీ డియోల్ కొడుకు ఆర్యమాన్ ఈ మూవీతో పరిచయం చేయాలని అనుకుంటున్నారట. కానీ, బేబీ లాంటి లవ్ కంటెంట్ ను నార్త్ సైడ్ జనాలు చూస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రముఖుల మదిలో మెదులుతుంది.
టాలీవుడ్ రిమేక్ లు బాలీవుడ్ లో వర్కవుట్ కావడం లేదు. ఆర్ఎక్స్ 100 ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసి భారీగా వసూళ్లు సాధిస్తే.. బాలీవుడ్ లో రిమేక్ చేసిన తర్వాత ఇక్కడ కలెక్ట్ చేసిన దాంట్లో కనీసం పావువంతు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. సరే హీరో లోపమా అనుకుంటే.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని నటించని జర్సీని షాహిద్ కపూర్ లాంటి స్టార్ తో తీసినా ఫలితం కనిపించలేదు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ నటుడు రాక్షసుడు రిమేక్ లో నటించినా ఆకట్టుకోలేకపోయింది. గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, హిట్: ది ఫస్ట్ కేస్, ఎంసీఏ ఇవన్నీ ఇక్కడ సక్సెస్ కాగా.. అక్కడ ఫెయిల్ అయిన వాటికి ఉదాహరణలు. ఓటీటీ అంతగా లేని కాలంలోనే రీమేక్ లు ఫట్ అయ్యాయి. ఇక ఓటీటీలు ఇంత విపరీతంగా ప్రాచుర్యం ఉన్న సమయంలో ఒక భాషలో హిట్ అయిన మూవీని అందరూ చూస్తారు. అది జానాలకు తొందరగా చేరిపోతుంది.
ఇది ప్రస్తుతం సాయి రాజేశ్ ముందున్న అతిపెద్ద సవాల్. ఈ లవ్ కంటెంట్ దక్షిణాదికి కనెక్ట్ అయ్యేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అభిరుచి కావచ్చు.. వాతావరణం కావచ్చు.. ఇవన్నీ ఇక్కడ కాసుల వర్షం కురిపించేందుకు కారణం కావచ్చు. ఆషిక్ బనాయా అప్నే నుంచి ఇలాంటి లవ్ కంటెంట్ ను చూసిన నార్త్ జనాలను మెప్పించడం రాజేశ్ కు అయ్యే పనిలా కనిపించడం లేదని మూవీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్క సినిమాతో హిట్ కొట్టి వెళ్లిన సందీప్ వంగాను దృష్టిలో ఉంచుకొని ఈ సాహసానికి ఒడికడుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.