ప్రస్తుతం 2000 నోటు చూద్దామన్నా కూడా సామాన్యుడికి దొరకడమే లేదు. గతకొంత కాలంగా 2000 నోటు బినామీల చేతిలో బందీ అయినట్లుగా తెలుస్తోంది. 2016 లో మోడీ ప్రభుత్వం 1000 , 500 నోట్ల ను రద్దు చేసి వాటి స్థానంలో 2000 , 500 కొత్త నోట్లు తీసుకొచ్చారు. అయితే 2000 నోట్లు గతకొంత కాలంగా వాడుకలో ఎక్కడా కనిపించడమే లేదు.
అలాగే బ్యాంక్ లలో కూడా కనిపించడమే లేదు. ఎందుకంటే బ్లాక్ మనీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వాళ్ళ చేతుల్లో బందీ అయిపొయింది కాబట్టి. దాంతో ఇక 2000 నోట్లను రద్దు చేయడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. త్వరలోనే కేంద్రం 2000 నోట్లను రద్దు చేయడం ఖాయమని వ్యాఖ్యానించి ప్రకంపనలు సృష్టించాడు.
తాజాగా పార్లమెంట్ లో 2000 నోట్ల ప్రస్తావన తీసుకొచ్చి వెంటనే కేంద్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరాడు. అభివృద్ధి చెందుతున్న , చెందిన దేశాలలో పెద్ద నోట్లు లేవని , అవి మన దేశంలో మనీ లాండరింగ్ కు అలాగే డ్రగ్స్ మాఫియా కు ఉపయోగకారిగా ఉన్నాయని , అందుకే 2000 నోట్లను రద్దు చేసి అవి మార్చుకునే వెసులుబాటు కల్పించాలని కోరాడు. మరి మోడీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.