ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన ఎందుకు రద్దయ్యిందో తెలుసా …… ఈనెల 19 న ప్రారంభించాల్సిన వందేభారత్ ట్రైన్ స్వల్పంగా ధ్వంసం కావడమే ! ఈనెల 19 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు అధికారులు.
అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఖరారు అయ్యాయి. చెన్నై నుండి వందే భారత్ ట్రైన్ బయలుదేరింది కూడా. అయితే మార్గం మధ్యలో కంచరపాలెం వద్ద ట్రైన్ ఆగిన సమయంలో కొంతమంది దుండగులు ట్రైన్ పై రాళ్లదాడి చేసారు. దాంతో రెండు బోగీల అద్దాలు దెబ్బతిన్నాయి. మోడీ ప్రారంభించాల్సిన ట్రైన్ ఇలా స్వల్పంగా ధ్వంసం కావడంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడంతో 19 న జరగాల్సిన ప్రారంభోత్సవం వాయిదా పడింది. ట్రైన్ కు మరమ్మత్తులు అయ్యాక బహుశా ప్రారంభం ఉంటుంది. ఇక ఈ సంఘటన ఆకతాయిల పనా ? లేక సంఘ విద్రోహుల పనా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.