
Cholesterol : ప్రస్తుతం మన శరీరంలో కొవ్వు శాతం పెరుగుతోంది. మన ఆహార అలవాట్లతోనే మనకు కొవ్వు శాతం ఎక్కువవుతోంది. దీని వల్ల గుండె రక్తనాళాల్లో రక్తసరఫరా మందగిస్తోంది. దీని వల్ల గుండెపోటు వస్తోంది. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ జరగక హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంటుంది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి.
మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, మద్యం తాగడం, పొగతాగడం, నూనె పదార్థాలు తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో మన శరీరంలో కొవ్వు పెరుగుతోంది. దీని వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఏర్పడుతోంది. జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల సమస్య నుంచి బయట పడొచ్చు. ఇలా మంచి ఆహారాలు తీసుకుని కొవ్వును తగ్గించుకోవాలి.
మొలకెత్తిన విత్తనాలు, పండ్ల రసాలు, నూనె లేకుండా చేసే పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు సమస్య రాదు. కొలెస్ట్రాల్ ను కరిగించుకునేందుకు చర్యలు తీసుకోవాలి. దీని వల్ల రక్తనాళాలు శుభ్రపడతాయి. కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. ఇలా మనం మన శరీరంలో ఏర్పడే కొవ్వును కరిగించుకునేందుకు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది.
20 గ్రాముల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, 10 గ్రాముల తెల్ల ఆవాలు, 2 టీ స్పూన్ల పసుపు, 10 గ్రాముల సోంపు తీసుకోవాలి. వీటిని ఒక జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజుకు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ లో వేసుకుని గోరువెచ్చగా అయ్యేలా మరిగించుకోవాలి. ఉయం టిఫిన్ చేశాక దీన్ని తాగాలి. దీన్ని తాగిన తరువాత ఒక పండు రసం తాగడం మంచిది. దీంతో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.