
ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం అలాగే సీనియర్ సిటిజన్స్ ను ఆర్ధికంగా ఆదుకోవాలని భావించి దీపావళి వేడుకలను నవంబర్ 4 న అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 50 నుండి 60 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమంలో దీపావళి వేడుకలలో పాల్గొనే అవకాశంతో పాటుగా తమవంతు బాధ్యతగా చారిటీ కార్యక్రమంలో కూడా పరోక్షంగా సహకరించే అవకాశం ఉండటంతో పలువురు ఎన్నారైలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను మహిళలు , సీనియర్ సిటిజన్ ల కోసం వినియోగించనున్నారు.