అమెరికాలో ఉంటున్న భారతీయుల మద్దతు లభించడం వల్లే 2016 లో నేను అమెరికాకు అధ్యక్షుడిని అయ్యానని, ఇక 2024 కూడా మద్దతు ఇస్తే నేనే మళ్లీ గెలుస్తానని అంటున్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా అమెరికాలోని భారతీయులతో సమావేశమయ్యారు ట్రంప్. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భారతీయులకు తన ఫామ్ హౌజ్ లో విందు ఏర్పాటు చేశారు ట్రంప్.
ఆ సందర్భంగా వాళ్ళతో మాట్లాడిన ట్రంప్ 2024 లో జరుగబోయే ఎన్నికల్లో మీ మద్దతు కావాలని, మోడీ మద్దతు కూడా నాకే ఉందని….. నేను అధ్యక్షుడు అయ్యాక భారత్ – అమెరికా సంబంధాలను మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటానన్నాడు ట్రంప్.