ఏపీలో జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై నిప్పులు చెరిగారు ఎన్నారైలు. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నారైల సమావేశం జరిగింది. ఆ సమావేశం తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన జరిగింది. పలువురు ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి హాజరయ్యాడు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి ‘ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్నారైలు.
ఏపీ ని జగన్ భ్రష్టు పట్టించారని , ఇప్పటికైనా ఎన్నారైలు మేల్కొనకపోతే ఏపీ మరింతగా అంధకారం అవుతుందని , వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అండగా నిలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు మళ్ళీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రావడానికి కృషి చేస్తామని ప్రతిన బూనారు.