
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగువాళ్ళతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. 2016 లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అయితే 2020 లో జరిగిన ఎన్నికల్లో మాత్రం జో బైడెన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇక 2024 లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు.
అందులో భాగంగానే తనకు సహకరించిన పలువురు భారతీయులను ఆహ్వానించి వాళ్లతో దీపావళి వేడుకలు జరుపుకున్నారు ట్రంప్. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ , రిపబ్లికన్ హిందూ సమాఖ్య వ్యవస్థాపకుడు షల్లీ కుమార్ లతో పాటుగా పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఆ సందర్బంగా తెలుగువాళ్లపై అలాగే భారతీయులపై ప్రశంసలు కురిపించారు ట్రంప్.