డార్లింగ్ ప్రభాస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రాన్ని చూసాడు. హీరో మహేష్ బాబు మల్టీప్లెక్స్ అయిన AMB లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పెషల్ షో చూసేలా ఏర్పాట్లు చేసాడు మహేష్. దాంట్లో కేవలం సినీ , రాజకీయ ప్రముఖులు మాత్రమే షో చూస్తుంటారు. జనాలతో కలిసి చూడటం ఇబ్బందికరం కాబట్టి అలా ప్లాన్ చేసాడు మహేష్ బాబు.
ఇక అందులోనే ప్రభాస్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాన్ని చూసాడు. ప్రభాస్ వెంట అన్నయ్య ప్రమోద్ కూడా ఉన్నాడు. ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ గెస్ట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు బాలయ్య తో మంచి పరిచయం ఉన్నప్పటికీ ఈ షో ద్వారా మరింత దగ్గరయ్యాడు. అలాగే బాలయ్య అంటే ఏంటో ఈ షోకు వెళ్లడం ద్వారా మరింత బాగా తెలిసింది. అందుకే బాలయ్య కోసం వీరసింహారెడ్డి చిత్రాన్ని చూసాడు ప్రభాస్ . బాలయ్య స్టైల్ , డైలాగ్ డెలివరీ చూసి షాక్ అయ్యాడట. ఈ వయసులో కూడా ఈ ఎనర్జీ అంటే మాములు విషయం కాదు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడట.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే…….. ప్రశాంత్ నీల్ తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ప్రాజెక్ట్ – K అనే సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆదిపురుష్ మాత్రం నీరసం తెప్పించేలా ఉంది టీజర్. మరి దాన్ని ఎలా మారుస్తారో ? ఎప్పుడు విడుదల అవుతుందో ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.