నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బ్లాక్ బస్టర్ షో ” అన్ స్టాపబుల్ విత్ NBK ”. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో సీజన్ కూడా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ రెండో సీజన్ కూడా వీరవిహారం చేస్తోంది. పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు , హీరోయిన్ లు ఈ షోకు వచ్చారు. ఇక బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ అయితే రికార్డుల మోత మోగించింది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా బాలయ్య ఇంటర్వ్యూ చేసాడు. ఆ ఎపిసోడ్ జనవరి 26 న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటే చూడాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు మొదటి సీజన్ లోనే మెగాస్టార్ చిరంజీవి తో ఈ షో చేయాలని అనుకున్నారు నిర్వాహకులు కానీ కుదరలేదు. మరి ఈ రెండో సీజన్ లోనైనా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
అయితే తాజాగా వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని ఈ ప్రశ్న అడిగితే నాకు ఇంకా పిలుపు రాలేదు వస్తే తప్పకుండా చూద్దామని ముక్తసరిగా చెప్పారు. దాంతో మెగాస్టార్ ను ఎందుకు ఆహ్వానించలేదు ……. లేక బాలయ్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అల్లు అరవింద్ చిరంజీవికి స్వయానా బావమరిది అనే విషయం తెలిసిందే. తెలుగు సినిమా రంగానికి ఈతరానికి బాలయ్య – చిరంజీవి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఇద్దరు కూడా మాస్ హీరోలు …… దిగ్గజాలు దాంతో ఈ ఇద్దరూ కలిసి ఆహా అన్ స్టాపబుల్ షోలో పాల్గొంటే నందమూరి – మెగా అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. మరి ఈ ఇద్దరూ ఆ షోలో పాల్గొనేది ఎప్పుడో చూడాలి.