
డార్లింగ్ ప్రభాస్ కు పెళ్లి చేయాలని , అతడికి పుట్టిన పిల్లలతో కలిసి ఆడుకోవాలని ఆశించాడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. అయితే ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. అసలు చెప్పాలంటే ప్రభాస్ పట్ల కృష్ణంరాజు కున్న వాత్సల్యాన్ని మాటల్లో చెప్పలేం…… ప్రభాస్ పట్ల ఎన్నో కలలు కన్నాడు కృష్ణంరాజు. ప్రభాస్ తో ” భక్త కన్నప్ప ” చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకున్నాడు.
అలాగే విశాల నేత్రాలు అనే సినిమా చేయాలని అనుకున్నాడు కృష్ణంరాజు . తాను చేయలేని పరిస్థితి రావడంతో విశాల నేత్రాలు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రభాస్ తో చేయాలని అనుకున్నాడు. కానీ అది కూడా కుదరలేదు. అయితే సినిమాల విషయాలను పక్కన పెడితే ప్రభాస్ కు మాత్రం పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నాలు చేసాడు. చాలా ఒత్తిడి కూడా చేసాడు కానీ ప్రభాస్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఆ కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు కృష్ణంరాజు.