పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి. 20 సంవత్సరాల తర్వాత మరోసారి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేస్తోంది. డిసెంబర్ 31 న విడుదలైన ఖుషి భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి రోజున మూడున్నర కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన ఖుషి రెండో రోజున కోటిన్నర కు పైగా వసూళ్లను సాధించింది. దాంతో రెండు రోజుల్లోనే 5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
20 సంవత్సరాల క్రితం విడుదలైన ఖుషి అప్పట్లో రికార్డుల మోత మోగించింది. పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ ను చేసిన సినిమా ఖుషి కావడం గమనార్హం. ఖుషి పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఎంతగా మార్చిందంటే …….. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిట్స్ కంటే ప్లాప్ చిత్రాల శాతమే ఎక్కువ. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిపేలా చేయడంలో ఖుషి చిత్రానిదే అగ్రస్థానం అని చెప్పాలి.
రెండు రోజుల్లోనే 5 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో తప్పకుండా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖుషి సాధించడం ఖాయమని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన భూమిక చావ్లా నటించగా ఆలీ , విజయ్ కుమార్, శివాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని పాటలు ఎవరు గ్రీన్ . ఖుషి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ షో వీక్షించడం విశేషం.