40.1 C
India
Friday, May 3, 2024
More

    రావణాసుర రివ్యూ

    Date:

    ravanasura Movie Telugu review
    ravanasura Movie Telugu review

    నటీనటులు : రవితేజ , అను ఇమ్మాన్యుయేల్ , మేఘా ఆకాష్
    సంగీతం : హర్షవర్ధన్ , భీమ్స్
    నిర్మాతలు : అభిషేక్ నామా , శ్రీకాంత్ విస్సా
    దర్శకత్వం : సుధీర్ వర్మ
    విడుదల తేదీ : 7 ఏప్రిల్ , 2023
    రేటింగ్ : 2.5 / 5

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా , శ్రీకాంత్ విస్సా సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 7 న విడుదలైన రావణాసుర ప్రేక్షకులను అలరించిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ :

    క్రిమినల్ లాయర్ అయిన కనకమహాలక్ష్మి ( ఫరియా అబ్దుల్లా ) దగ్గర జూనియర్ లాయర్ గా పని చేస్తుంటాడు రవీంద్ర అలియాస్ రవి ( రవితేజ ). ఫార్మా కంపెనీ సీఈవో హారిక ( మేఘా ఆకాష్ ) తండ్రి ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. దాంతో ఆ కేసు వాదించాలని క్రిమినల్ లాయర్ కనకమహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. అయితే కనక మహాలక్ష్మి ఆ కేసు వాదించడానికి నిరాకరిస్తుంది. దాంతో జూనియర్ లాయర్ రవిని సంప్రదించడంతో అతడి ఒత్తిడి వల్ల ఆ కేసు విచారణకు అంగీకరిస్తుంది. అదే సమయంలో నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలకు రవీంద్ర కు సంబంధం ఏంటి ? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    రవితేజ
    నేపథ్య సంగీతం

    డ్రా బ్యాక్స్ :

    సెకండాఫ్

    నటీనటుల ప్రతిభ :

    మాస్ మహారాజ్ రవితేజ పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయి. రావణాసుర పాత్రకు తగ్గట్లుగా రవితేజ మెస్మైరైజ్ చేసాడు. ఈ సినిమాను ఒక్కడే తన భుజాలపై మోశాడు. ఫరియా అబ్దుల్లా , దక్ష , మేఘా ఆకాష్ ల పాత్రలు ఫరవాలేదు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే అను ఇమ్మాన్యుయేల్ , పూజిత పొన్నాడ లకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు.

    సాంకేతిక వర్గం :

    హర్షవర్ధన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. భీమ్స్ అందించిన ఒక ఐటెం సాంగ్ అదిరిపోయింది. విజువల్స్ బాగున్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఇక దర్శకుడు సుధీర్ వర్మ విషయానికి వస్తే …… ఫస్టాఫ్ ను బాగానే తీసినప్పటికి సెకండాఫ్ కు వచ్చేసరికి అంతగా రాణించలేకపోయాడు. ట్విస్ట్ లు బాగానే పెట్టాడు కానీ సెకండాఫ్ పై మరింత దృష్టి సారిస్తే తప్పకుండా బాగుండేది.

    ఓవరాల్ గా :

    రవితేజ అభిమానులకు మాత్రమే.

    Share post:

    More like this
    Related

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Daksha Nagarkar : డిఫరెంట్ లుక్స్ తో సెగలు పుట్టిస్తున్న దక్ష నగార్కర్

    Daksha Nagarkar : దక్ష నగార్కర్ అంటే అందరికీ సుపరిచితమే. ఏకే...

    Anu Emmanuel comments : ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో గడపమన్నాడు.. అను ఇమ్మాన్యుయెల్ కామెంట్లు..!

    Anu Emmanuel comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Anu Emmanuel : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. అను ఇమ్మాన్యుయెల్ సంచలన వ్యాఖ్యలు..!

    Anu Emmanuel : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు పుట్టింది...