Anu Emmanuel : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు పుట్టింది కాదు.. ఈ పదం ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది బలమైన ఆరోపణ.. ముద్దుగుమ్మలంతా ఈ కాస్టింగ్ కౌచ్ మీద చేస్తున్న వ్యాఖ్యలు నెట్టింట ఓ ఊపు ఊపేస్తున్నాయి.. ఇది వరకు ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి భయపడిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వారికీ జరిగిన దారుణాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు..
ప్రస్తుతం బుల్లితెర నుండి వెండితెర వరకు సీనియర్ నుండి కుర్ర భామల వరకు ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.. ఆ కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో హాట్ భామ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. నాని మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ అను ఇమ్మాన్యుయెల్..
ఈ భామ మొదటి సినిమాతోనే హిట్ అందుకు స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది. పవన్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి సినిమాల్లో నటించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే ఈ రెండు ప్లాప్ అవ్వడంతో ఈమెకు ఛాన్సులు తగ్గిపోయాయి.. ప్రజెంట్ కార్తీతో జపాన్ సినిమాలో నటించగా ఆ సినిమాతో అతి త్వరలోనే ఆడియెన్స్ ను పలకరించనుంది.
ఇక తాజాగా ఈ భామ కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ తనకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ సమస్యను మనం ఎదుర్కోవాలి అని ఒత్తిడికి గురి కాకుండా కుటుంబ సభ్యులతో చెప్పి పరిష్కరించుకోవాలి అని తెలిపింది. ఈ భామ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.