రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే నాకు క్రష్ అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది అందాల రాశి ఖన్నా. తాజాగా ఈ భామ నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ” అన్ స్టాపబుల్ 2 విత్ NBK ” లో పాల్గొంది రాశి ఖన్నా. సీనియర్ హీరోయిన్ లు జయసుధ , జయప్రద లతో కలిసి ఈ షోలో పాల్గొంది రాశి ఖన్నా.
ఇటీవలే ఈ షో షూటింగ్ జరిగింది. తాజాగా ప్రోమో విడుదల చేసారు. ఇక ఈ ఎపిసోడ్ ఈనెల 23 న స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 23 న జయసుధ , జయప్రద , రాశి ఖన్నా ల ఎపిసోడ్ అయ్యాక డిసెంబర్ 30 న ప్రభాస్ , గోపీచంద్ ల ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు సీనియర్లతో రాశి ఖన్నాని తీసుకొచ్చాడు బాలయ్య.
ఇక బాలయ్య రాశి ఖన్నా ను ఏ హీరో ఇష్టం అని ప్రశ్నించగా మొహమాటం లేకుండా ” విజయ్ దేవరకొండ ” అంటూ సమాధానం ఇచ్చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ” వరల్డ్ ఫేమస్ లవర్ ” అనే చిత్రంలో నటించింది ఈ భామ. ఆ సినిమాలో రొమాన్స్ ఫుల్లుగా ఉంది విజయ్ దేవరకొండ – రాశి ఖన్నా ల మధ్య. ఇంటిమేట్ సీన్ లలో రెచ్చిపోయి నటించింది రాశి ఖన్నా. పైగా తన క్రష్ అయిన విజయ్ దేవరకొండతో రొమాన్స్ కాబట్టి ఇరగదీసింది అన్నమాట.