Rashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. రాను రాను తన సినిమాలు తగ్గినా మార్కెట్ ను మాత్రం పదిలంగా కాపాడుకుంటూ వస్తుంది. తన ఫస్ట్ సినిమాతోనే కుర్రకారు నుంచి విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. క్లీవేజ్ షోలు చేస్తూ.. హాట్ అందాలను స్వీట్ గా చూపిస్తూ కనువింధు చేస్తుంది. అమ్మడు రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోలు మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి. బ్లూ డ్రెస్ వేసుకొని బెడ్ పై పడుకొని హొయలు పోతూ దిగిన ఫొటోలను రాశీఖన్నా షేర్ చేసింది.
రాశి ఖన్నాకు టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్ అనే గుర్తింపు కూడా ఉంది. అమ్మడి ఖాతాల్లో చాలా వరకు బాక్సాఫీస్ మూవీస్ ఉన్నాయి. కానీ, ఇటీవల రాశికి కలిసి రావడం లేదు.. ఊహలు గుసగుసలాడేలో నాజూకైన అందంతో మెప్పించడంతో రాశికి క్రేజ్ పెరిగింది. బెంగాల్ టైగర్, తొలిప్రేమ, సుప్రీం, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన ఒకటి,రెండు సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో ఫ్యాన్స్, అభిమానులు ఎక్కడ దూరమైపోతారోనని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫొటోలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. స్కై బ్లూ డ్రెస్ లో హొయలు వలకబోస్తూ చూపులతో ఇచ్చిన ఫోజులకు సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి. బెడ్ రూమ్ లో హాట్ హాట్ ఫోజులతో తెరలేపింది. బార్బీ బొమ్మలా కనిపించింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఫుల్ బాటిల్ కిక్కు రాశి ఖన్నా సొగసులో ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూపుతిప్పుకోలేని అందాలతో రాశి హీట్ పెంచేసింది. మొత్తానికి ఈ ఫొటోలు సోషల్ మీడియాను కుదుపు కుదిపాయనడంలో ఎలాంటిసందేహం లేదు. ప్రస్తుతం రాశి తమిళంలో కొన్ని ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ల రాకతో రాశి పోటీని ఎదుర్కోక తప్పడంలేదు.