30.2 C
India
Sunday, May 5, 2024
More

    చిరంజీవి – కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు

    Date:

    chiranjeevi - K. vishwanath movies list
    chiranjeevi – K. vishwanath movies list

    మెగాస్టార్ చిరంజీవి – కళాతపస్వి కె. విశ్వనాథ్ కాంబినేషన్ లో మొత్తంగా మూడు చిత్రాలు వచ్చాయి. అందులో మొదటగా” శుభలేఖ ”అనే చిత్రం రాగా ఇది సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ తర్వాత” స్వయంకృషి” అనే సినిమా చేసారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ముచ్చటగా మూడో సినిమాగా ” ఆపద్భాంధవుడు ” వచ్చింది. అయితే మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ ఆపద్భాంధవుడు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

    చిరంజీవి అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో …… ఆ సమయంలో చేసిన చిత్రమే ” శుభలేఖ ”. చిరంజీవి – సుమలత జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి , సుమలత , శుభలేఖ సుధాకర్ , తులసి , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , రమణమూర్తి , రాళ్ళపల్లి , సాక్షి రంగారావు , నిర్మలమ్మ , వంకాయల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు సంభాషణలు అందించాడు. ఇక కెవి మహదేవన్ సంగీతం అందించాడు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ కు మంచి ఊపును తెచ్చింది.

    ఇక సుప్రీం హీరోగా పక్కా మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎదిగిన సమయంలో అంటే 1987 లో విడుదలైన స్వయంకృషి సంచలన విజయం సాధించింది. చిరంజీవి లాంటి మాస్ హీరో చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా జీవించి ఆ పాత్రకు ప్రాణం పోసాడు. మెగాస్టార్ కు నటన పరంగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రం స్వయంకృషి. అలాగే ఉత్తమ నటుడి నంది అవార్డ్ తో పాటుగా మరికొన్ని అవార్డులను తెచ్చిపెట్టిన చిత్రం స్వయంకృషి.  ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ చిత్రంలోని పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి.

    ఇక ముచ్చటగా మూడో చిత్రంగా ఈ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ” ఆపద్బాంధవుడు ”. ఈ చిత్రంలోని పాటలు కూడా బాగున్నాయి. చిరంజీవికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అయితే కమర్షియల్ గా విజయం సాధించలేదు. 1992 నాటికి చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు. ఆ సమయంలో చిరంజీవి మరింతగా కమర్షియల్ హీరో కావడం వల్లో లేదా మరో కారణమో కానీ మొత్తానికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మొత్తానికి విశ్వనాథ్ కు బాగా ఇష్టమైన నటుడు చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో జయాపజయాలకు అతీతంగా విశ్వనాథ్ – చిరంజీవి ల బంధం కొనసాగింది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...