29.2 C
India
Saturday, May 4, 2024
More

    bichagadu 2 Review : బిచ్చగాడు-2 మూవీ ఫస్ట్ రివ్యూ.. విజయ్ ఆంటోనీ విజిల్స్ వేయించాడుగా!

    Date:

    bichagadu 2 review
    bichagadu 2 review

    Bichagadu 2 First Review : బిచ్చగాడు సినిమా సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాతో ఒకటి రుజువు అయ్యింది.. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాలో ముక్కు ముఖం తెలియని హీరో ఉన్నా కూడా ఆడియెన్స్ నుండి సేమ్ రెస్పాన్స్ లభిస్తుంది.. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంత బాగా ఆదరిస్తారో అందరికి తెలిసిందే..

    బిచ్చగాడు సినిమా మామూలుగా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు అండ్ తమిళం భాషలలో భారీ హిట్ అయ్యింది. ఆఊపు లోనే ఈ సినిమా 25 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తెరకెక్కింది..

    ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రఫ్ఫాడించడానికి రెడీ అయ్యింది.. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబందించిన ప్రివ్యూ షో రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో వేయగా అతి కొద్దీ మంది ప్రముఖులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. బిచ్చగాడు కంటే కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు.

    ఇక ఈ సీక్వెల్ లో విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్టు తెలుస్తుంది.. ఈ సినిమాలో ఈసారి బ్రెయిన్ మార్పిడిపై జరిగే ప్రయోగం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్న కోణంలో కథ సాగుతుందట.. డబ్బు, ఎమోషన్స్ చుట్టూ సాగే ఈ కథలో విజయ్ ఆంటోనీ మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు జీవించారని చెబుతున్నారు. చూడాలి థియేటర్స్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bichagadu 2 Review : బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

    Bichagadu 2 Review : బిచ్చగాడు సినిమా అంటే తెలియని ప్రేక్షకులు...

    అదరగొట్టిన బిచ్చగాడు-2 ట్రైలర్.. మరోసారి అలా కనిపించనున్న విజయ్ ఆంటోనీ..

    ఐదేళ్ల క్రితం బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ్ డబ్బింగ్ మూవీకి...

    భారీ ప్రమాదానికి గురైన బిచ్చగాడు హీరో : పరిస్థితి విషమం

    బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ భారీ ప్రమాదానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య...