27.8 C
India
Thursday, May 2, 2024
More

    Gudivada నియోజకవర్గ రివ్యూ : గుడివాడలో బలమెవరిది.. గెలుపెవరిది?

    Date:

    • 2024లో పాగా వేసేదేవరు..
    Gudivada
    Gudivada

    Gudivada : ఏపీలోని గుడివాడ నియోజవకర్గంపై ఈ సారి రెండు ప్రధాన పార్టీల కన్ను పడింది. ఇటు అధికార వైసీపీ నుంచి ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న కొడాలి నాని ఆ నియోజకవర్గం నుంచి బలమైన నేతగా ఎదిగారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలుపై లేచే నేతగా ఆయనకు పేరుంది. బూతుల మంత్రిగా కూడా ఆయనకు పేరు వచ్చిందంటే కొడాలి నాని ఎలా మాట్లాడుతారో తెలుగు రాష్ర్టాల ప్రజలందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం గుడివాడ నియోజకవర్గాన్ని టీడీపీ కూడా చాలెంజ్ గా తీసుకుంది. ఈ సారి ఎలాగైనా కొడాలి నానికి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నది. అక్కడ ఆయనను ఓడించి, ఇక నానిని ఇంటికే పరిమితం చేయాలని పావులు కదుపుతున్నది.

    అయితే గుడివాడలో పోటీలో ఉండే ముఖ్య అభ్యర్థుల వీరే..

    వైసీపీ నుంచి కొడాలి నాని ఇక్కడ రాష్ర్ట స్థాయిలో కీలక నేత ఉన్నారు. ఆయన రెండు సార్లు టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్ చెంత చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వార్తలో నిలుస్తుంటాడు. 2019లో జరిగిన ఎన్నికల్లో కొడాలి వెంకటేశ్వర్రావు(నాని) ఘన విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన గట్టి పోటీదారుగా నిలిచే అవకాశముంది. ఇప్పటికే నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    ఇక టీడీపీ నుంచి ఈసారి పలువురు ప్రముఖుల పేరు వినిపిస్తున్నది. రావి వెంకటేశ్వర్ రావు, నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని, తో పాటు మరికొందరు కీలక నేతల పేరు వినిపిస్తున్నది. పార్టీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతోందో వేచి చూడాల్సి ఉంది. గుడివాడ నియోజకవర్గంలో అన్న ఎన్టీఆర్కు బలమైన అభిమానులు ఉన్నారు. అయితే కొడాలి నానిని ఢీకొట్టాలంటే టీడీపీ అస్థాయిలో ముఖపరిచయం ఉన్న వ్యక్తిని అక్కడ పోటీలో పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో ఇటీవల మృతి చెందిన హీరో తారక రత్న సతీమణి ఆలేఖ్య పేరు కూడా ప్రస్తావనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇక్కడ సీరియస్ వర్క్ చేస్తున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించే నానికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని, అక్కడ తనకు దీటుగా ఒక నేతను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

    గుడివాడ నియోజకవర్గం డీటైల్స్..
    జిల్లా – కృష్ణ
    నియోజకవర్గం- గుడివాడ
    లోక్ సభ- మచిలీపట్నం
    మండలాలు – 3
    ఓటర్లు – 2,08,950

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kodali Nani : ఇవే నాకు చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన కొడాలి నాని..

    Kodali Nani : తనకు ఇవే చివరి ఎన్నికలని మాజీమంత్రి కొడాలి నాని...

    Gudivada: గుడివాడలో ఉద్రిక్తత…టిడిపి-వైసిపి పోటాపోటీ ర్యాలీలు

      టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది....

    Andhra Politics in Atlanta : అట్లాంటాలో ఆంధ్రా పాలిటిక్స్.. ఇక గుడివాడ టీడీపీదే..

    Andhra politics in Atlanta : ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా...

    Gudivada Bus Stand : ఓడరేపుగా మారిన గుడివాడ బస్టాండ్.. పరువుపాయే..(వీడియో)

    Gudivada bus stand Become port : శ్రీకాంత్ హీరోగా నటించిన...