టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ‘రా.. కదలిరా’ పేరుతో టీడీపీ భారీ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇరు వర్గాలు గుడివాడలో పోటాపోటీగా పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.
ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే వైసిపి నాయుకుల ర్యాలీ కి అనుమతి ఇచ్చి మాకు ఏందుకు ఇవ్వడంలేదని తెలుగుదేశం,జనసేన నాయుకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం ద్గగరకు చేరుకోని పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను తోసుకుంటూ టిడిపి-జనసేన నేతలు ఎన్టీఆర్ విగ్రహం వైపుకు దూసుకెళ్లారు..దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నారు. పోలీసులు టిడిపి-జనసేన నాయకులను అరెస్ట్ చేశారు. రెండు ప్రధాన పార్టీలు నేతల కార్యక్రమాలు ఉన్న నేపద్యంలో పోలీసులు గట్టి బందోస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.