36.1 C
India
Saturday, May 4, 2024
More

    Etala party change : పార్టీ మార్పుపై ఈటల సంచలన వ్యాఖ్యలు.. ట్విటర్ ద్వారా చెప్పిన బీజేపీ లీడర్

    Date:

    Etala party change
    Etala party change

    Etala party change : చాలా కాలం పాటు బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవిలో పని చేసిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే మంచి నేతగా గుర్తింపు సంపాదించుకున్న ఆయన సౌమ్యుడిగా, సచ్చీలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హుజూరాబాద్ గడ్డపై పలు దఫాలుగా గెలుస్తున్న ఆయనకు అక్కడ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. స్థానికంగా బీఆర్ఎస్ కేడర్ ను తన వైపునకు తిప్పుకొని బీజేపీ నుంచి గెలిచి రికార్డు సృష్టించారు ఆయన.

    భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ మెంబర్ గా పదవి అప్పగించింది పార్టీ. ఆయన ఆ పదవిని కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నేతలను బీజేపీలోకి తీసుకు వచ్చేందుకు ఆయన చాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనే పార్టీ మారబోతున్నారంటూ ఈ మధ్య వార్తలు హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎటు చూసినా రాజేందర్ గురించి ఒక అపవాదు విపరీతంగా ట్రోల్ అవుతుంది.

    ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారుతున్నారని, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వైపు ఆయన చూస్తున్నారని అంటూ సోషల్ మీడియాతో పాటు, ప్రధాన మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. జూపల్లి, పొంగులేటితో పాటు ఈటల, కొండా కూడా త్వరలో కాంగ్రెస్ లో చేరుతారంటూ వస్తున్న  వార్తలపై ఆయన స్పందించారు. తాను ఎటువైపు వెళ్లడం లేదని, పార్టీ మారే ప్రసక్తే లేదని ట్విటర్ వేదికగా చెప్పారు.

    మోడీ, అమిత్ షా అంటే ఎంతో అభిమానం ఉందని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలనను అనచివేయడం, తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగువేసేందుుకు నిరంతరం పని చేస్తానని ఆయన చెప్పుకచ్చారు. పార్టీ మార్పుపై పత్రికల్లో వస్తున్న కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు మారే వ్యక్తిని తాను కానని, నా అభిప్రాయం లేకుండా వార్తలు రాయడం సరికాదని ఆయన చెప్పుకచ్చారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    బండి పదవీ పోవడానికి కారణం కేసిఆర్ఃమంత్రి పోన్నం

    మాజీ సీఎం కేసీఆర్ ప్రోద్బలంతోనే కరీంనగర్ MPబండి సంజయ్ కుమార్ ను...

    Manda Krishna Madiga : వరంగల్ ఎంపీ బరిలో మంద కృష్ణ మాదిగ.. ఆ వర్గాలను ఆకర్షించేందుకు బీజేపీ బిగ్ ప్లాన్!

    Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు...

    Modi Achievements : 10ఏండ్లలో కాంగ్రెస్ కంటే మోడీ సాధించిన ఘనతలు ఇవీ!

    Modi Achievements : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం 2014లో...