31.3 C
India
Wednesday, June 26, 2024
More

    AP Politics : ఏపీ ప్రజలకు వైసీపీ అంటే ఇష్టం లేదు  

    Date:

    AP Politics : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముగిసింది. బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు ధీమాలో ఉన్నారు. కూటమి అధికారం చేపడుతుందని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. సర్వే సంస్థలు కూడా కూటమిదే విజయమని సంకేతాలు ఇస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థలు కూడా కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేక సోషల్ మీడియాలో కూటమి నాయకులపై తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.

    వైసీపీ అభ్యర్థులకు, నాయకులకు ఓటమి కళ్ళముందు కనబడటంతో వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవడంలేదు. ఆ తప్పును ప్రజలపై నెట్టేయడానికి తాజాగా పలు సోషల్ మీడియా సంస్థలను సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో ప్రజల తప్పును ఏవిదంగా ప్రచారం చేయాలనే ఆలోచనలో వైసీపీ రాజకీయ మేధావి వర్గం పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

    వైసీపీ పార్టీకి అనుచర వర్గముగా కొనసాగుతున్న ఒక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాలకు దారితీసింది. వైసీపీ అభ్యర్థులు తక్కువగా గెలిస్తే ఏపీ ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం లేనట్టు భావించాల్సి వస్తుందని  సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. వైసీపీ మరోసారి అధికారం చేపడితేనే ప్రభుత్వంపై విశ్వాసం ఉన్నట్టని ఆ పార్టీ నాయకుల ఉద్దేశ్యం స్పష్టం అవుతోంది. ఓటరు తీర్పు వ్యతరేకంగా వచ్చిన నేపథ్యంలో వైసీపీ స్వీకరించేందుకు అనుకూలంగా లేదని తేలిపోయింది.

    రాజకీయ క్రీడల్లో విజయం, అపజయం రెండు సహజమే. రెండింటిని సమానంగా చూడాల్సిందే. అప్పుడే నాయకుడిపై ప్రజలకు, ప్రజలపై నాయకుడికి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతాయి. రాజకీయ ప్రవేశం చేసిన ప్రతి నాయకుడు తాను పోటీ చేసిన స్థానం నుంచి గెలవాలని కోరుకుంటారు. ఆ విషయంలో తప్పులేదు. కానీ గెలిస్తే తన సొంత ఇమేజి తో గెలిచానని ప్రచారం చేసుకుంటారు. ఓడిపోతే తనపై ప్రజలకు విశ్వాసం లేదని, అందుకే ఓటమి చెందానని ప్రజలపై తప్పుడు ప్రచారం చేస్తారు.

    పరిపాలన భాద్యతలు ఐదేళ్లు మోసిన వైసీపీ నాయకులు చేసిన తప్పులను ఒప్పుకోకుండా ప్రజలపై తప్పు మోపడంపై ఏపీ లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మంచి పరిపాలన అందిస్తే ప్రజలు ఎందుకు ఆమోదించారు అనే ప్రశ్న కూడా ఏపీలో తలెత్తడం కొసమెరుపు.

    Share post:

    More like this
    Related

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...