
AP Volunteers : ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ పై పరిమితులు విధించగా తాజాగా రేషన్ కంపెనీ లోను వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించింది.
ఎండియు ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీ పిలవకూడదని స్పష్టం చేసింది. ఈరోజు నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి అని ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలి పింది.
మొత్తం మీద ఎన్నికల కమిషన్ కు వాలంటీర్లపై టిడిపి నేతలు ఫిర్యాదు చేశారని అందుకే వాలం టీర్లపై ఈసీ ఆంక్షలు విధిస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు ఒకటో తారీకున ఇంటింటికి వెళ్లి వాలంటీ ర్లు పంపిణీ చేసేవారని ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పెన్షన్లు అందకుండా టిడిపి వారు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.