
బ్రేకింగ్ న్యూస్ …….. నందమూరి తారకరత్న కుప్పకూలిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంఘటన వివరాలలోకి వెళితే…… నారా లోకేష్ ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలపడానికి వెళ్ళాడు నందమూరి తారకరత్న.
పాదయాత్ర ప్రారంభం కావడంతో ఆ యాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. దాంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. హుటాహుటిన తారకరత్న ను కుప్పం లోని ఆసుపత్రికి తరలించారు. హర్ట్ బీట్ బాగానే ఉందని కాకపోతే మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించాలని భావిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కు ఈ విషయం తెలియడంతో హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి చేరుకున్నారు.