AP: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. స్థాని క ఎమ్మెల్యే విష్ణు.. కొత్త ఇన్ఛార్జి వెలంపల్లి శ్రీనివాస్ వర్గాల మధ్య అసలు పొసగడం లేదు. విష్ణుకే సెంట్ర ల్ టిక్కెట్టు ఇవ్వాలని ఆయన వర్గం నేతలు పట్టుబడుతున్నారు. సత్యనారాయణపురంలో విష్ణు అనుచరు లు బుధవారం రాత్రి రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణు త ప్ప మరెవరికీ తాము మద్దతు ఇచ్చేది లేదని వారు తెలగేసి చెబుతున్నారు. సిట్టింగులను కాదని వైసిపి అధిష్టానం ఇతర నేతలకు టికెట్లు ఇస్తుంది. దీంతో అసంతృప్తి లో సిట్టింగు ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఇన్ని రోజులు పార్టీ జెండా ను మోసిన మాకు కాదని వేరే వాళ్లకు టికెట్లు ఇస్తే వారికి సహక రిం చేది లేదని ప్రస్తుత ఎమ్మెల్యే విష్ణు బహిరంగానే చెబుతున్నారు. నియోజకర్గంలో ని అనుచరులు మాత్రం మా నేతకే విజయవాడ సెంట్రల్ టికెట్టు కేటాయించాలని లేక పోతే వైసిపిని ఓడిస్తామని హెచ్చరి స్తున్నా రు..