30.5 C
India
Thursday, May 2, 2024
More

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    Date:

    • అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి
    • రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
    Nominations in AP
    Nominations in AP

    Nominations in AP : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు 25 చివరి తేదీగా నిర్ణయించారు.  26న నామినేషన్లను పరిశీలిస్తారు.  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ.. అభ్యర్థులకు అదే రోజు గుర్తులను కేటాయిస్తారు. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుంది, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.

    నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు

    1)అభ్యర్థులు నామినేషన్ల దాఖల కు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుంది.

    2)పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి.

    3)నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది

    4) పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించ బడదు.

    5) అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.

    6) 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.

    7) నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించ బడతాయి, అలానే 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు.

    నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తారు.

    9)అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

    10) పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.

    11) ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 40 లక్షల ఖర్చు పరిమితి, అలానే పార్లమెంట్ అభ్యర్థికి 95 లక్షల రూపాయల ఖర్చు పరిమితం.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...