Director Bobby ప్రస్తుతం మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే ధోరణి పెరిగిపోతోంది. అంతా స్వార్థమే ప్రధానంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. వారి కోసమే ఎండలో తిరుగుతున్నారు. ఇతరుల నుంచి మాటలు కూడా పడుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన ఫుల్ టైం సినిమాలు చేసుకుంటే రూ. కోట్లు సంపాదించుకోగలరు. కానీ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు.
బ్రో సక్సెస్ మీట్ లో ప్రముఖ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. మాస్ సినిమాలు చేయడం పవన్ కల్యాణ్ తోనే సాధ్యం. ఇంకా ఎవరైనా చేయడం కుదరదు. సినిమాకు త్రివిక్రమ్ మాటలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఆయన అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. దీంతో సినిమా సక్సెస్ అయిందని చెప్పారు.
వాల్తేరు వీరయ్యలో ప్రతినాయకుడి(విలన్)గా సముద్రఖనిని అనుకున్నాం. కానీ పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నానని చెప్పడంతో సరే అన్నాం. అలా ఆయన బ్రో సినిమాను తెరకెక్కించారు. మంచి పేరు సంపాదించుకున్నారు. పవన్ కల్యాణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయనను చూడటానికే జనం థియేటర్ల వరకువస్తున్నారు. అలా బ్రో సినిమా మంచి హిట్ సాధిస్తోంది.
మామ అల్లుళ్ల నటన ఆకట్టుకుంటోంది. సినిమా ఆద్యంతం అద్భుతంగా సాగింది. మంచి కథ, కథనంలో బలం ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఇక రాజకీయంగా కాస్త విమర్శలు వచ్చినా అవి కూడా సమసిపోయాయి. అలా బ్రో సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. నవ శకానికి నాంది పలుకుతోంది.