
BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో ఊహలతో నిర్మించిన బ్రో అంచనాలు అందుకోలేకపోయింది. సినిమాకు రాజకీయ రంగు మాత్రం పులుముకుంది. కానీ ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. బడ్జెట్ ను అందుకోలేకపోయింది. రూ. 97 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అంత మేర డబ్బు రాబట్టలేకపోయింది. దీంతో సినిమా సక్సెస్ అందుకోలేదు.
సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో వచ్చిన సినిమా ఆధారంగా తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేసినా సక్సెస్ మాత్రం అందుకోలేదు. దీంతో సినిమా నష్టాలు మూటగట్టుకుంది. ఇప్పుడు 11న భోళా శంకర్ రావడంతో ఇక సినిమా పక్కకు పోవడం ఖాయం. ఈ వారం రజనీకాంత్ నటించిన జైలర్ కూడా రాబోతోంది. దీంతో ఇక బ్రో సినిమా ఆడటం కుదరదని తేలిపోయింది.
సినిమా భారీ నష్టాలే మూటగట్టుకుంది. నైజాంలో రూ.10 కోట్లనష్టం వచ్చింది. సినిమా ఏకంగా రూ. 30 కోట్ల నష్టాల్లో పడింది. ఈనేపథ్యంలో ఇతర సినిమాల రాకతో బ్రో సినిమా దాదాపుగా సైడైపోయినట్లే. ఎన్నో అంచనాలతో వచ్చిన బ్రో ఇంత భారీ నష్టాలు మూటగట్టుకోవడం విచారకరమే. పీపుల్ మీడియా ఆధ్వర్యంలో నిర్మించిన సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఓటీటీలో విడుదల చేయడం ఒకటే మిగిలి ఉంది.
ఓవర్సీస్ లో మొదటి వారం 1.34 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. పది రోజుల్లో 1.40 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టుకుంది. యూఎస్ ఏలో కూడా భారీ నష్టాలే మూటగట్టుకుంది. ఇలా బ్రో ఆశించిన అంచనాలు అందుకోలేదు. నిర్మాతలకు భారీ నష్టాలే మిగిల్చింది. కానీ సినిమాకు రాజకీయ రంగు మాత్రం పులుముకుంది. వైసీపీ నేతలు సినిమాపై భారీగానే విమర్శలు చేశారు.