
Anil Kumar Yadav :
ఏపీ సీఎం జగన్ ను ఎవరైనా విమర్శిస్తే వారికి కౌంటర్ అటాక్ ఇవ్వడంలో మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు. ప్రెస్ మీట్లే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లోనూ మాజీ సీఎం చంద్రబాబు ఎంత ఘోరంగా మాటలతో దాడి చేశాడో అందరికీ తెలిసిందే. మంత్రిగా,ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. తనకు అన్నీ జగనే అని చెప్పుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ స్వరం మారుతున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి వరకు వపన్ కల్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డ అనిల్ ఇప్పడు తన సొంత పార్టీ నేతలకే వార్నింగ్ లు ఇస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజులగా సైలెంట్ గా ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇప్పడు తానేంటో చూపిస్తానంటూ సవాల్ విసరుతున్నారు. సైలెంట్ గా తనను చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీ అధికార పార్టీ వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ కొద్ది రోజులుగా నెల్లూరులో ఉండడం లేదు. ఇటీవల సీఎం జగన్ తో ఎమ్మెల్యేల సమీక్షకు వెళ్లిన తర్వాత నెల్లూరుకు వచ్చారు. సమీక్షలో జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంత మందికి రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని ఖరాఖండిగా తేల్చిసినట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ సమయంలో ఆయన తన అనుచరులతో సమావేశం పెట్టారు. తనపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజులు ఇక్కడ లేకపోయినంత మాత్రాన ఇక తన పనిఅయిపోయిందంటూ ప్రచారం చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఇలాగే చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను ఇలాగే సైలెంట్ గా ఉంటే.. చంపేసేలా ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. జగన్ సన్నిహితుల్లో ఒకరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన అనిల్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.