37.8 C
India
Friday, May 3, 2024
More

    Nellore Constituency Review : నియోజకవర్గ రివ్యూ : నెల్లూరు సిటీలో విజేతగా నిలిచేదెవరు..?

    Date:

    Nellore Constituency Review :

    వైసీపీ : పీ అనిల్ కుమార్ యాదవ్(ప్రస్తుత ఎమ్మెల్యే)
    టీడీపీ : పీ నారాయణ

    ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలక నియోజకవర్గంగా నెల్లూరు సిటీకి పేరుంది. సుమారు 1.80 లక్షల ఓటర్లు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో ఇక్కడ రెండు ప్రధాన పార్టీల నుంచి మాజీ మంత్రులు బరిలోకి దిగనున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 1998 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. అయితే గతంలో ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. రెడ్డి సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉంది. ఎస్టీ, బీసీల జనాభా కూడా ఎక్కువగానే ఉంది.

    ఇక టీడీపీ నుంచి ఇక్కడ తెలుగురాష్ర్టాల్లోనే ప్రముఖ విద్యాసంస్థ నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ బరిలో ఉండబోతున్నారు. తెలుగు దేశం పార్టీకి ప్రధాన ఆర్థికవనరుగా ఉన్న ఆయన ఈసారి కూడా నెల్లూరు సిటీ నుంచి బరిలో ఉండనున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కనిపించలేదు. మళ్లీ ఇటీవల తరచూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయన, 2019 ఎన్నికల్లో ఓటి పాలయ్యారు. ఆర్థికంగా బలంగా ఉండడంతో పాటు కాపు సామాజిక వర్గం కలిసివస్తుందని అధినేత అంచనాతో ఆయన బరిలోకి దిగారు. కానీ స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు.

    ఇక వైసీపీ నుంచి బరిలోకి దిగనున్న అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ తర్వాత బలమైన నేతగా ఎదిగారు. మొదటిసారి మంత్రివర్గంలో చోటు సాధించారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు. గతంలో ప్రజారాజ్యం నుంచి మొదటిసారి పోటీచేసిన, అనిల్ కుమార్ నాడు గెలవలేదు. 2014, 2019లో ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అనిల్ కుమార్ కుఇన్నాళ్లు అండగా ఉన్న కోటంరెడ్డి ఈసారి టీడీపీలోకి వెళ్లారు. దీంతో పాటు దూకుడు స్వభావంతో అనిల్ కుమార్ కొంత కార్యకర్తలకు దూరమయ్యారని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పథకాలు, జగన్ ఛరిష్మా తనను గెలిపిస్తుందని అనిల్ కుమార్ నమ్మకంతో ఉన్నారు. అటు టీడీపీ నుంచి నారాయణ బలంగా కనిపిస్తున్నారు. ఈసారి ఆయన గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈసారి ఇక్కడ జనసేన ఓటు బ్యాంక్ కూడా కలిసివస్తే టీడీపీ గెలుపు ఇక సునాయసమే కానుంది. అయితే ఈసారి ఎలాగైనా  గెలవాలని నారాయణ ప్రయత్నిస్తుండడం, పచ్చ జెండా ఎగిరేస్తే ఇక్కడ టీడీపీ మొదటి సారి గెలిచినట్లువుతుంది. మరి రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలంగా ఉండడంతో, 2024 ఎన్నికల్లో ప్రజలు ఎవరివైపు నిలుస్తారో వేచిచూడాలి.

    Share post:

    More like this
    Related

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    AP Volunteers : ఏపీలో భారీ సంఖ్యలో వాలంటీర్ల రాజీనామా

    AP Volunteers : ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్న...