39.8 C
India
Friday, May 3, 2024
More

    Kalki : ‘కల్కి’ రిలీజ్ విషయంలో అశ్వినీదత్ ట్విస్ట్.. డేట్ ను మార్చ బోతున్నారట!

    Date:

    Kalki 
    Kalki 

    Kalki  నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇటు టాలీవుడ్ నుంచి అటు హాలీవుడ్ వరకు ఈ సినిమాపై ఇప్పుడు హాట్ టాపిక్ నెలకొంది. ఇటీవలే కల్కికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా హాలీవుడ్ డైరెక్టర్లు సైతం చూసి ప్రసంశించారు. ఇటీవల టీమ్ యూఎస్ లోని శాన్ డియాగోలో షూటింగ్ కోసం జూలై 20న అక్కడికి వెళ్లింది. అక్కడి నుంచే గ్లింప్స్, టైటిల్ ను రిలిజ్ చేసింది.

    కల్కి 2898 ఏడీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇదులో భారీ తారాగణం నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తుండగా ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ చేస్తున్నారు. ఆమెకు సబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో బిగ్ బీ ఈ ప్రాజెక్ట్ లోకి కమల్ హాసన్ ను ఆహ్వానంచే వరకు ఆయన ఉన్నాడన్న విషయం బయటకు లీక్ చేయలేదు.

    ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగా అందులో మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా 12 జనవరి, 2024లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. 9 మే, 2024న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఆ తేదీకి వైజయంతి బ్యానర్ కు మంచి సింక్ ఉంది. ఆ రోజున ఈ బ్యానర్ లో రిలీజైన సినిమాలు టాలీవుడ్ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోయాయి. జగదేక వీరుడు-అతిలోక సుందరి, మహానటి చిత్రాలు 2 కూడా మే 9 వ తేదీనే రిలజ్ అయ్యాయి. అదే డేట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. పైగా 2024, మే 9 గురువారం వస్తుంది. కాబట్టి వీకెండ్ కూడా కలిసి వస్తుందని, పైగా సమ్మర్ కూడా కావడంతో మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు.

    దీనికి తోడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా పూర్తవ్వాలంటే కొంచెం టైమ్ పడుతుందని, అనుకున్న డేట్ వరకు కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఆ తేదీ వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి సినిమాకు మంచి హైప్ తీసుకురావచ్చని భావిస్తున్నారట. అయితే దీనిపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు.

    Share post:

    More like this
    Related

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kalki Update : కల్కి మూవీ నుంచి రేపు మరో అప్ డేట్  

    Kalki Update : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...