
CM Jagan : వైఎస్ మరణం.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో బాధపడిన సందర్భం. సగటు జనాలే కాదు ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ఏడ్చారు..ఆవేదన వ్యక్తం చేశారు. వారి మధ్య రాజకీయ విభేదాలు ఉండొచ్చు. కానీ అంతకంటే మించి మానవత్వం గొప్పది. ఆ సందర్భంలో రాజకీయాలు చేయలేని ఎవరూ అనుకోరు. అప్పటిదాక నవ్వుకుంటూ జనాల మధ్యలో ఉన్న వ్యక్తి.. హఠాత్తుగా ఘోర ప్రమాదంలో చనిపోతే బాధపడని వ్యక్తి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ జనాలు ఓ వైపు ఆవేదనలో ఉండగా.. మరోవైపు సీఎం కావాలని రాజకీయం చేసిందేవరో అందరికీ బహిరంగ రహస్యమే.
జగన్ రెడ్డి అండ్ కో మళ్లీ ఎన్నికల వేళ.. వైఎస్ మరణంపై అనుమానాలు ఉన్నాయని సెంటిమెంట్ ప్రచారానికి తెరతీశారు. ఒకప్పుడు తనకు సీఎం పదవి ఇవ్వలేని కుటుంబం మొత్తం.. కాంగ్రెస్ ను నానా తిట్లుతిట్టారు. తమ కుటుంబం..సీఎం స్థాయిలో ఉండడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. సోనియానే వైఎస్ ను చంపించిందని, రిలయన్స్ తో కుమ్మక్కై ఈ దారుణం చేశారని తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. అంతా చేసి ఇప్పుడు తల్లీకూతుళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక జగన్ రెడ్డి మాత్రం కొత్త కథలు వండివారుస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై తమకు అనుమానాలున్నాయని సజ్జల కొత్త ఆరోపణలు మళ్లీ ప్రారంభించారు. ఆయనకు సిగ్గు వేయదేమో కానీ.. వినేవాళ్లకు కాస్త ఎబ్బెట్టుగానే ఉంది. రిలయన్స్ కు చెందిన పరిమళ్ నత్వానీకి వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఇచ్చి ఎమ్మెల్యేలతో ఓటు వేయించినప్పుడే జగన్ రెడ్డి తన తండ్రి ఆత్మను తీవ్రంగా కదిలించివేశాడు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్లీ అశాంతి రేపుతున్నారు.
తండ్రి ప్రమాదవశత్తూ మరణిస్తే.. ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని దాన్నే పెట్టుబడిగా మార్చుకుని రాజకీయం చేస్తున్నారు జగన్ రెడ్డి. ఎన్ని ఎన్నికలు వచ్చినా అవే రాజకీయాలు చేసుకుంటూ పోతారా? అని జనాలు నవ్వుకుంటున్నారు. తండ్రి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్న జగన్ రాజకీయం తీరు ఇంకా మారదా? అని విస్తుపోతున్నారు.