29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Bhagwant Kesari : ”భగవంత్ కేసరి”గా బాలయ్య.. పవర్ఫుల్ పోస్టర్ తో నెక్స్ట్ లెవల్ అంతే!

    Date:

    Bhagwant Kesari
    Bhagwant Kesari

    Bhagwant Kesari : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 10న బాలకృష్ణ తన పుట్టిన రోజు జరుపుకో నున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమా నుండి మాస్ ట్రీట్ ఉందని రెండు మూడు రోజులుగా మేకర్స్ చెబుతూనే ఉన్నారు.

    మరి అన్నట్టుగానే మాస్ ట్రీట్ అయితే ఇచ్చేసారు.. అది కూడా రెండు రోజులు ముందుగానే బాలయ్య, అనిల్ కాంబోలో తెరకెక్కుతున్న 108వ సినిమాకు టైటిల్ ప్రకటించారు.. బాలయ్య బర్త్ డే కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎవరు ఇంత వరకు చేయని అదిరిపోయే ప్లానింగ్ తో టైటిల్ అనౌన్స్ మెంట్ చేసారు..

    ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ ను ఏర్పాటు చేసి ఈ సినిమాకు ”భగవంత్ కేసరి” అనే టైటిల్ ను రిలీజ్ చేసారు.. ఈ టైటిల్ గత కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. మరి మేకర్స్ కూడా ఇదే టైటిల్ ను అనౌన్స్ చేసారు.. టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన మాస్ పోస్టర్ మరో లెవల్లో ఉంది.. అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి మూవీపై అంచనాలు భారీగా పెంచేశారు..

    ఎప్పటిలాగానే బాలయ్యను అనిల్ కూడా పవర్ఫుల్ గా చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది.. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NBK 109 Updates : అసురులపై బాలయ్య దండయాత్ర.. ‘NBK109’ నుండి పవర్ఫుల్ పోస్టర్!

    NBK 109 Updates : నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్...

    Bhagwant Kesari First Week : మొదటి వారంలో  ‘భగవంత్ కేసరి’ రికార్డ్ కలెక్షన్స్.. బాలయ్య మరోసారి సంచలనం!

    Bhagwant Kesari First Week : నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్స్ ప్లాప్స్...