
Tamarind Juice : మన భారతీయ వంటకాల్లో చింతపండు ప్రత్యేకత కలిగినది. పుల్లగా తియ్యగా ఉండే దీన్ని వాడటం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. దీని వాడకంతో మన శరీరానికి పలు లాభాలు కలుగుతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. కళ్లు, చర్మానికి మేలు చేస్తుంది. చింతపండు గుజ్జుతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నిషియం పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సాయపడుతుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ధయామిన్, రిటో్లావిన్, నియాసిన్ వంటి 8 విటమిన్లు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చింతపండులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యల నివారణకు దీన్ని వాడుతుంటారు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. చింతపండు రసం గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
చింతపండులో మెగ్నిషియం ఉంటుంది. 120 గ్రాముల గుజ్జులో 110 మిల్లీ గ్రాముల చింతపండు తాగడం వల్ల మనకు అనుకూల ఫలితాలుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె లయను నియంత్రిస్తుంది. దీంతో చింతపండు తినడం వల్ల మనకు చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.