31.5 C
India
Sunday, June 16, 2024
More

    Bihar BJP : బీహార్ లో బీజేపీ బోల్తాపడింది..

    Date:

    Bihar BJP
    Bihar BJP-Nitish Kumar

    Bihar BJP : బీహార్ లో రాజకీయం ఎవరు చేస్తారు. లల్లూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ హవా బీహార్ లో నడుస్తుంది. బీహార్ లో ఉన్న ప్రధాన నాయకులు దాదాపుగా ఒక కమిట్ మెంట్ కు కట్టుబడి ఉంటారనేది ప్రజల నమ్మకం. కానీ నితీష్ కుమార్ మాత్రం ఎప్పుడు ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితిని బీహార్ ప్రజలు ఎదుర్కొంటారు. ఒక్క ప్రజలే కాదు ఆయనను నమ్ముకొన్న నాయకులకు సైతం నితీష్ కుమార్ రాజకీయ నిర్ణయం అంతుపట్టదు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు. ఆ పొత్తు ఎన్ని రోజులు కొనసాగుతుందో అంతుపట్టదు. ఈ నేపథ్యంలో ఆయనను నమ్ముకున్న నాయకులతోపాటు, ప్రజలకు కూడ అయిష్టత ఏర్పడింది.

    ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ఎప్పుడు ఏపార్టీ తో కలిసి ఉంటారో తెలియదు. ఏ పార్టీ తో చేతులు ఎప్పుడు కలుపుతారో అంతుపట్టదు.ఇటీవలనే నితీష్ కుమార్ కాంగ్రెస్ కు దూరమై బీజేపీ తో చేతులు కలిపారు. లోకసభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నారు. పొత్తుల రాజకీయంతో బీజేపీ సగానికి పైగా సీట్లను మిత్రులకు పంచి పెట్టింది. ఫలితాలు రావడం కంటే ముందుగానే బీజేపీ బీహార్ లో బోల్తా పడింది. ఈ  నేపథ్యంలో పొత్తులు కాంగ్రెస్ కు సువర్ణావకాశం అయ్యిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

    2019 లో ఎన్డీయే కూటమి పొత్తులు పెట్టుకొని 40 స్థానాల్లో పోటీ చేసింది. 39 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ ఒకవైపు నితీష్ కుమారుతోపాటు, పాశ్వాన్ కుమారుడితో పొత్తు పెట్టుకుంది. అయినప్పటికీ బీజేపీ అక్కడ వెనుకబడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది గమనించిన మోదీ బీహార్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రచారం భారీగా చేపట్టారు. అయినా బీజేపీ అనుకున్న 2019 లక్ష్యాన్ని అందుకోవడం అనుమానంగానే ఉందని ప్రచారం సాగుతోంది.

    తేజస్వి యాదవ్ రాజకీయ ప్రాధాన్యత ప్రతి ఎన్నికల సమయానికి పెరిగిపోతోంది. ఆయన ధాటిని తట్టుకోవడం కష్టంగానే ఉంది. తేజస్వి యాదవ్ ఒకే విధానంకు కట్టుబడి ఉంటారనే పేరు ఉంది ప్రజల్లో. కలిసివచ్చే పార్టీలతో నమ్మకంగా ఉంటారనే పేరు ఉంది. నితీష్ కుమార్ పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నితీష్ కుమార్ ను నమ్మి నట్టేట మునిగిందనే ప్రచారం సాగుతోంది.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...

    Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక

    Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు....

    Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట.. బెయిల్ మంజూరు

    Rahul Gandhi : ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు...