Samantha : స్టార్ హీరోయిన్ సమంత కొన్నాళ్లుగా పర్సనల్ లైఫ్ లోనే కాకుండా ఆరోగ్య పరంగా కూడా బాధ పడుతుంది.. మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్టు చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఎవరి సహాయం లేకున్నా ఒంటరిగా పోరాడుతూ మళ్ళీ మాములు స్థితికి చేరుకొని పర్సనల్ లైఫ్ లో మాత్రమే కాదు ప్రొఫెషనల్ గా కూడా సక్సెస్ అవుతుంది.
కొన్నాళ్లుగా పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్న ఈ భామ ప్రస్తుతం సమంత ఖుషి సినిమా చేస్తూనే బాలీవుడ్ లో సిటాడెల్ మూవీ చేస్తుంది.. ఖుషి మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఇక సిటాడెల్ షూట్ కూడా శరవేగంగా జరుగుతుంది.. ఇదిలా ఉండగా సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే..
మరి తాజాగా ఈ భామ ఒక పోస్ట్ చేయగా అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన కోట్ ను షేర్ చేసింది. దీని అర్ధం ఏంటంటే.. ”చావును ఆపలేనప్పుడు ప్రేమతో బాగు చేసుకోవడమే” ప్రేమ, జీవితం, చావు అంటూ ఈమె పెట్టిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ తో ఈ భామ కొత్త అనుమానాలకు తెరలేపింది.
సమంత ఈ పోస్ట్ గురించి ఏం చెప్పాలని అనుకుంది అని ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.. అనారోగ్యం గురించి చెప్పాలని అనుకుందా? తన జీవితం లోని ప్రేమ గురించి చెప్పాలని అనుకుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నడుమ ఆమె ఓ కొత్త వ్యక్తితో తిరుగుతోంది. అతనితో క్లోజ్ గా వుంటుంది. దీంతో సమంత అతనితో ప్రేమలో పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ఆమె ప్రేమ నిజమే కావచ్చు అంటున్నారు. ఈ భామ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఒంటరిగా జీవిస్తూ కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది.
ReplyForward
|