Home EXCLUSIVE Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

Samantha : బికినీలో సమంత అందాలు.. ప్రకృతిని ఆస్వాదిస్తోందట..!

15
Samantha
Samantha

Samantha : సమంత రూత్ ప్రభు మలేషియాలోని లంకావిలోకి వెకేషన్ కు వెళ్లింది. అక్కడి నుంచి కొత్త చిత్రాలను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఆమె ఎలా విహారయాత్ర చేస్తుందో తన అభిమానులకు తెలిపేందుకు శుక్రవారం (ఫిబ్రవరి 23) సాయంత్రం ఇన్‌ స్టాలో బికినీ ఫొటోలను పోస్ట్ చేసింది.

సమంత రూత్ ప్రభు పోస్ట్
‘అత్యున్నత ప్రేమ (వైట్ హార్ట్ ఎమోటికాన్),’ అనేది సమంత రూత్ ప్రభు తన తాజా పోస్ట్‌లో ఉంచిన క్యాప్షన్. మలేషియాలో నుంచి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. దటాయ్ లంకావీలో బస చేసిన ప్రదేశాన్ని జియో ట్యాగ్ చేసింది. ఫస్ట్ ఫొటోలో ఆమె గోధుమ రంగు బికినీలో కనిపించింది, రెండో ఫొటోలో తను స్టే చేసిన కుటీరంలో ధ్యానం చేసినట్లుగా.. ఇలా చాలా ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

సమంత ఈ పోస్ట్ కు ఒక రోజు ముందు తన వయస్సు, జీవక్రియ వయస్సు గురించి పంచుకుంది. ఒక ఫొటోలో 36 సంవత్సరాల వయస్సులో 50.1 కిలోల బరువు మరియు 23 సంవత్సరాల జీవక్రియ (మెటబాయలిజం) కలిగి ఉన్నట్లు చెప్పింది. ‘ఎప్పటికీ ఉదయం సూర్యుడి కోసం వెతుకుతూ. ఉత్తమమైన ఉదయం’ అని ఆమె క్యాప్షన్‌లో రాసింది.

మైయోసిటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత అమెరికాలో చికిత్స పొందింది.  తన ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు గతేడాది జూలై నుంచి సంవత్సరం పాటు తన ప్రాజెక్ట్‌లకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ టూర్స్ చేపడుతుంది. తను మళ్లీ వెండితెరపై కనిపిస్తానని గత వారం ప్రకటించింది.

సమంత విజయ్ దేవరకొండతో ‘ఖుషి’లో కనిపించింది. 2018లోని మహానటి వారిద్దరు కలిసి చేసిన సినిమా ఇది. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సమయంలో, నటుడు రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ కూడా నటించి మెప్పించింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)