Samantha Divorce : దాంపత్య జీవితం కొన్ని రోజులే కొనసాగినా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ అని గుర్తింపు పొందారు సమంత, నాగ చైతన్య. 2017లో ఒక్కటైన ఈ జంట. నాలుగేళ్లకే 2021లో విడిపోయారు. వీరు విడిపోయేందుకు కారణాలు తెలియలేదు. అయితే ఎవరికి వారు వారికి ఇష్టం వచ్చినట్లు కారణాలు చెప్తుంటారు. వ్యక్తి గత కారణం అంటూ వారు చెప్పుకున్నారు. అయినా కూడా రూమర్స్ మాత్రం ఆగలేదు. చై, సామ్ విడాకుల అంశం ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గానే ఉంది.
మ్యారేజ్ తర్వాత సామ్ బోల్డ్ సీన్లలో నటించడం ఇష్టం లేకనే నాగ చైతన్య విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. సామ్ ఇప్పట్లో తల్లి కాకూడదనుకుందట. ఇది చైకి ఇష్టం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడట ఇదో రూమర్.
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో ఎఫైర్ కొనసాగిస్తుందని పుకార్లు కూడా ఉన్నాయి. అయితే, ఇవన్నీ అబద్ధాలే.. సోషల్ మీడియాలో చాలా నిరాధారమైన కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పుకార్ల సృష్టిస్తున్న వైరల్ రాయుళ్లపై సమంత ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పింది. ఇందులో భాగంగానే కొన్ని మీడియా సంస్థలు, యూ ట్యూబ్ ఛానళ్లపై కేసులు కూడా నమోదు చేయించింది. దీంతో కోర్టు కలుగజేసుకొని ఆయా ఛానల్స్ లో కంటెంట్ ను తొలగించాలని ఆదేశించింది. వారు కూడా తొలగించారు. వీటన్నింటి నేపథ్యంలో సమంత డీప్రెషన్ కు లోనైంది.
సమంత విడాకులు తీసుకోవాలని నిర్ణయం ప్రకటించడం వెనుక ఓ యువతి హస్తం ఉందని రీసెంట్ గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఇటీవల సమంత మలేషియాలో తన స్నేహితురాలు మేఘనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.
నా విలువైన నిర్ణయాలకు మేఘే కారణం.. అని సమంత పోస్ట్ లో రాసుకచ్చింది. అది తన లైఫ్ లో ఎంత ముఖ్యమో మేఘన వెల్లడించింది. అయితే, ఆమె జీవితంలో విలువైనదిగా భావిస్తున్న విడాకుల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో మేఘన సలహాను సమంత తీసుకుందని అంటున్నారు. మేఘన చెప్తేనే సమంత డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.