33.1 C
India
Thursday, May 2, 2024
More

    Movies With Festival Names : మన పండగల పేర్లతో వచ్చిన సినిమాలేంటో తెలుసా?

    Date:

    Movies With Festival Names
    Telugu Movies With Festival Names

    Movies With Festival Names : మన భారతీయులకు పండగలంటే ఇష్టం. అందుకే ప్రతి రాష్ట్రంలో కూడా వారి ప్రాంతానికి అనుగుణంగా పండగలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. మన తెలుగు సినిమాలు కూడా పండగల పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. పండగల పేర్లతో వచ్చిన సినిమాలు విజయం సాధించాయి. దీంతో టైటిళ్ల విషయంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సహజం. సినిమా పేరుతోనే సక్సెస్ ముడిపడి ఉంటుందని నమ్ముతారు. అందుకే పేరు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

    తెలుగు సినిమా పండగల పేర్లతో వచ్చిన సినిమాలు హిట్ గా నిలిచాయి. విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ ప్రధాన పాత్రధారులుగా తీసిన సంక్రాంతి సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. దీంతో చాలా మంది హీరోలు పండగల పేర్లతో సినిమాలు నిర్మించి శభాష్ అనిపించుకున్నారు. సినిమా హిట్ కావడానికి పండగల పేర్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు .

    శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన దసరా సినిమా కూడా హిట్టయింది. ప్రేక్షకుల అంచనాలు అందుకుంది. ఉదయ్ కిరణ్, రిచా హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా హోలీ. 2002లో వచ్చిన ఈ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకుడు. ఎస్వీ క్రిష్ణారెడ్డి దర్శకత్వంలో 1997లో వచ్చిన సినిమా ఉగాది. ఎస్వీ క్రిష్ణారెడ్డి హీరోగా లైలా హీరోయిన్ గా నటించారు.

    రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రధారులుగా చేసిన సినిమా మహాశివరాత్రి. రేణుక శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకుంది. క్రిష్ణవంశీ దర్శకత్వంలో 2006లో వచ్చిన సినిమా రాఖీ. ఎన్టీఆర్, ఇలియానా, చార్మి ప్రధాన పాత్రల్లో నటించారు. నగ్మా కథాయికగా బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా గురుపౌర్ణమి.

    శోభన్ బాబు హీరోగా భానుప్రియ, రాధిక శరత్ కుమార్ జంటగా నటించిన సినిమా కార్తీకపౌర్ణమి. సునీల్ హీరోగా నిక్కీ గల్లానీ, డింపుల్ చొపదా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రిష్ణాష్టమి. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా వినాయక చవితి. 1956లో జమున ప్రధాన పాత్రలో నాగుల చవితి సినిమా వచ్చింది. వేణు, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో దీపావళి సినిమా నిర్మించారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....

    Raksha Bandhan : రాఖీ కట్టే తీరు ఏంటో తెలుసా?

    Raksha Bandhan : మన సనాతన సంప్రదాయంలో మనం ఎన్నో పద్ధతులు...

    Rakhi festival : రాఖీ పండగ ఎలా వచ్చిందో తెలుసా..? పురాణాల్లో ఏముందంటే?

    Rakhi festival : అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి గుర్తుగా నిర్వహించుకునేది...

    Rakhi Festival : రాఖీ పండుగ గురువారమే.. కన్ఫమ్ చేసిన పండితులు

    Rakhi Festival : అన్నా చెల్లెళ్ల అనుబంధం, ప్రేమకు గుర్తుకు నిర్వహించుకునే రాఖీ...